రవి తేజ “నేనింతే” సినిమా గుర్తుందా…ఆ సినిమాలో షియాజీ షిండే ఒక డైలాగ్ చెప్తాడు”2% సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీలో బ్రతుకుతున్నాం” అంటూ ఒక నిర్మాతగా తమ ఆవేదనని వ్యక్తం చేస్తాడు. అయితే అలాంటి బాధల్లో కూరుకుపోయిన తెలుగు చిత్ర పరిశ్రమకి మంచి రోజులు వచ్చాయి అని 2016 సంక్రాంతి స్పష్టంగా చెప్తుంది. దాదాపుగా 84ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో ఈ సీజన్ చాలా కలసి వచ్చింది అని తెలుస్తుంది. దానికి కారణం ఏంటంటే ఈ ఏడాది కేవలం ఒక్క జనవరి నెల, తొలి సంక్రాంతి సీజన్ లో దాదాపుగా 225కోట్ల వ్యాపారం జరగడంతో టాలీవుడ్ పరిశ్రమ ఫూల్ ఖుషీగా ఉంది.
వివరాలు తీసుకుంటే.. ఈ ఏడాది తొలి నాళ్ళలో విడుదలయైన నేను..శైలజా చిత్రం మంచి హిట్ తో శుభారంభాన్ని అందించగా, ఇక సంక్రాంతి బరిలో దిగిన పందెం కోళ్లు, “ఎన్టీఆర్- నాన్నకు ప్రేమతో”, “బాలయ్య- డిక్టేటర్”, “నాగ్-సోగాడే”, శర్వానంద్- “ఎక్స్ప్రెస్ రాజా” కలెక్షన్స్ దుమ్ము దులిపి సూపర్ డూపర్ హిట్స్ గా నిలవడం, ఇక ఆ మధ్య వచ్చిన “కిల్లింగ్ వీరప్పన్” సైతం మంచి టాక్ తో ఆడటం దాదాపుగా ఆల్ హిట్స్ అన్న వాదనకి బలాన్ని చేకూర్చాయి. ఇక వసూళ్ల పరంగా చూసుకుంటే…సోగ్గాడే చిన్నినాయనా నాన్నకు ప్రేమతో సినిమాలు దాదాపుగా 100 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేయగా…మిగతా సినిమాలన్నీ కలిపి రూ.125 కోట్ల దాకా వసూలు చేసి 84ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో ఈ సంక్రాంతిని “చిరస్మరణీయ” సంక్రాంతిగా నిలిపాయి.
ఏది ఏమైనా…సినీ పరిశ్రమ కళకళలాడితే..అదే అందరికీ ఆనందం కదా…ఎందుకంటే దాన్ని అమ్ముకునే వారి కన్నా…నమ్ముకున్న వారే ఎక్కువ కాబట్టి.