విలక్షణ నటుడు సాయి కుమార్ ఈ మధ్య తన అంతరంగాన్ని ఆవిష్కరించే పనిలో భాగంగా, ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడాడు. తన గురించి, తన కొడుకు గురించి, అంతేకాకుండా తన కుటుంబం గురించి సైతం ‘ఓపెన్ హార్ట్’ తో మాట్లాడాడు ఈ నటుడు. తన కరియర్ గురించి మాట్లాడే సమయంలో తాను సినీ పరిశ్రమలో పడ్డ కష్టాలను వివరిస్తూ, తనని అప్పటి యువ హీరోలు ఇద్దరు సుమన్, రాజశేఖర్ చాలా ఇబ్బంది పెట్టారని, రాజశేఖర్ తొలి సినిమాకు డబ్బింగ్ చెప్పే సమయానికే తాను సుమన్ కు చాలా సినిమాలు డబ్బింగ్ చెప్పానని, అయితే అలా చెప్పడం వల్ల, గొంతు మార్చి రాజశేఖర్ కు డబ్బింగ్ చెప్పాల్సిందిగా నిర్మాతలు అడిగేవారని, మరో పక్క కొన్ని అనుకోని కారణాలతో సుమన్ జైలుకు వెళ్ళగా, రాజశేఖర్ బడా హీరోగా మారగా, తాను రాజశేఖర్ కు డబ్బింగ్ చెప్తూ బ్రతికానని చెప్పాడు.
ఇక సుమన్ విడుదలయ్యి మళ్ళీ టాప్ హీరోగా నిలదొక్కుకోగా, ఆయనకు సైతం డబ్బింగ్ చెప్పానని, ఇలా అటు రాజశేఖర్, ఇటు సుమన్ ఇద్దరికీ డబ్బింగ్ చెబుతూ ఎదిగానని సాయి కుమార్ తెలిపాడు. మరో పక్క సుమన్ కు డబ్బింగ్ చెప్పిన వ్యక్తి రాజశేఖర్ కు చెప్పకూడదు రాజశేఖర్ కు డబ్బింగ్ చెప్పిన వ్యక్తి సుమన్ కు డబ్బింగ్ చెప్పకూడదు అని ఆ హీరోలు ఇద్దరు తమకు తాము నిర్ణయాలు తీసుకుని తనని చాలా ఇబ్బంది పెట్టగా, ఇదే విషయమై మ అమ్మ సుమన్ వాళ్ల అమ్మగారిని కలసి విషయం వివరించారని, ఈ విషయం సుమన్ కు తెలిసి, తనను చాలా ఆదుకున్నాడు అని తన కరియర్ లోని ఎత్తుపల్లాలను వివరించాడు ‘అగ్ని’.
ఏది ఏమైనా, ఇప్పుడంటే బాబులు పేర్లు చెప్పుకుని నటన లేకపోయినా సినీ ఎంట్రిస్ ఇచ్చేస్తున్నారు కానీ, ఒకప్పుడు అంతా కష్ట ఫలితమేగా.