టాలీవుడ్ పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నిజం చెప్పాలి అంటే ఇప్పుడున్న బడా ఫ్యామిలీస్ లో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలే ఎక్కువగా ఉన్నారు అంటే నమ్మక తప్పని నిజం. తాజాగా ఆ శిబిరం నుంచి ఒక హీరోయిన్ కూడా వస్తుంది అని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోస్ గా కొనసాగుతున్న మెగా హీరోలందరూ తమిళ సినిమాలపై మోజు పెంచుకున్నారు అని టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న టాక్.
విషయం ఏంటంటే…టాలీవుడ్ రీ-ఎంట్రీ ఇస్తున్న మెగా స్టార్ చిరు వెతికి…వెతికి చివరకు తమిళ మూవీ “కత్తి”తో “బాస్ ఈజ్ బ్యాక్” అనే సంకేతాలు పంపనున్నాడు. ఇక పవర్ స్టార్ పవన్ ఇప్పుడు గబ్బర్ సింగ్ చిత్రంలో బిజీగా ఉన్నప్పటికీ ఆ తరువాత ఎస్ జె సూర్య డైరెక్షన్ లో కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ మూవీ ‘వేదాళం’ను రీమేక్ చేసేందుకు సిద్దం అవుతున్నట్లు వినిపిస్తున్న వార్త.
ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరన్ కూడా బ్రూస్ లీ దెబ్బకి మైండ్ బ్లాక్ అయ్యీ..చివరకు తమిళ సినిమాపై కన్నేసాడు….తమిళ చిత్రం “తని ఒరువన్ “తో దూసుకు వస్తున్నట్లు తెలుస్తుంది. ఇక బన్నీ సైతం తమిళ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో తలుక్కున మెరవనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా..సేఫ్ జోన్ లో ఉండేందుకు మెగా బ్యాచ్ మొత్తం తమిళ సినిమాలను ఎంచుకోవడం ఎంతవరకూ న్యాయమో వారికే తెలియాలి.