మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు వివాహం ఈ నెల 28 న బెంగుళూరులోని చిరు ఫామ్ హౌస్ లో జరగనుండగా.. మార్చి 31 న రిసెప్షన్ గ్రాండ్ గా హైదరాబాద్ లో జరగనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులతో పాటు, పలువురు రాజకీయ నాయకులు సైతం పాల్గొననున్నారు. ఈ పనులన్నీ రామ్ చరణే దగ్గరుండి చూసుకుంటున్నారు.
శ్రీజ వివాహం కళ్యాణ్ తో జరగనుండగా.. మొదట జైపూర్, ఉదయ్ పూర్ లలో ఒక ప్రదేశాన్ని వేదికగా అనుకున్నప్పటికీ రెండు ప్రదేశాలు ప్రస్తుతం వేడిగా ఉండటం తో బెంగుళూరులోని చిరు ఫామ్ హౌస్ లోనే ఈ విహహ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబాల సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు. మరోవైపు వీరి వివాహానికి ముందు మెగా సంగీత్ కు ఇప్పటికే అదిరిపోయే రేంజ్ లో ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.