ఇండస్ట్రీ లో కొద్దో గొప్ప హీరోలతో పరిచయం ఉంటే ఇక వాడికి తిరుగులేదు.ఎవ్వర్నైన మభ్య పెడతాడు,డబ్బులిస్తే ఏదో ఒక రూపం లో హీరో తో పరిచయం కల్పించడం ఇండస్ట్రీ లో సాదరణమే.కాని అతి చేష్టలతో ఉన్న ఉద్యోగం పోగొట్టుకొని రోడ్డున పడ్డాడు,హీరో నాగ చైతన్య అసిస్టెంట్.చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకోడానికి అలవాటు పడ్డ ఈ ప్రబుద్ధుడు,మరీ శ్రుతిమించడం తో చైతూ సరైన ట్రీట్మెంట్ ఇచ్చాడని,వాడికి తగిన శాస్తి జరిగిందని అన్నపూర్ణ స్టూడియో లోని వర్కర్స్ ఆనందంగా ఉన్నారని సమాచారం.అసలేం జరిగిందో వివరాలు చూద్దాం…..
మలయాళం లో బ్లాక్ బ్లాస్టర్ అయిన ‘ప్రేమమ్’సినిమాను తెలుగులో ‘మజ్ను’,పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి ఆభిమానులకి విదితమే.ఈ చిత్రం కి సంబంధించి వైజాక్ లోని ఒక కాలేజీ లో షూటింగ్ జరిగింది.షూటింగ్ కి అనుమతి ఇచ్చిన ప్రిన్సిపాల్ స్టూడెంట్స్ చైతూ తో ఫొటోస్ దిగాలని ఆశపడుతున్నారని,చైతూ అసిస్టెంట్ కి చెప్పాడట.దాంతో మనోడు రెచ్చిపోయి దానికి లక్షలు ఖర్చు అవుతుందని,డబ్బులివ్వమని, అన్నాడంట.దీంతో కంగుతిన్న ప్రిన్సిపాల్ ఈ విషయాన్నీ డైరెక్ట్ గా చైతూ దగ్గరికి తీసుకెళ్లడం తో,ఒక్క సారిగా చైతూ కి ఆశ్చర్యం కలిగి వెంటనే అసిస్టెంట్ ని పనిలోనించి తొలగించాడు.ఇతను అన్నపూర్ణ స్టూడియో లో కూడా హావ నడిపాడని వినికిడి.అక్కడ స్టాఫ్ ని కూడా బాగా ఇబ్బంది పెట్టేవాడని,ఇతనిపై వేటు తో వాళ్ళు ఆనందంగా ఉన్నారని భోగట్ట!