ఒకప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ సైతం చెన్నై వేదికగా ఉండేది అని మనం చూడనప్పటికీ విన్నాం. అయితే అప్పుడెప్పుడో మన టాలీవుడ్ చెన్నై ను వదిలి హైదరాబాద్ కు వలస వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయిన సంగతి సైతం మనకు తెలిసింది. ఇదిలా ఉంటే ఎంతకాదు అని అనుకున్నా, అక్కడక్కడా తమిళ ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి కాస్త పైకి కనిపించని వైరం ఉంటూ వస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ వైరం కాస్త స్నేహంగా మారి, ఆ స్నేహం బంధం మరింత బలపడుతూ పోతూ ఉండడం, హర్షించ దగ్గ విషాయమే. దానికి గల కారణాలు అనేకం అనే చెప్పాలి.
అందులో ముఖ్యంగా మన తెలుగు హీరోలు ఎంతో మంది తమిళ దర్శకులతో పని చేయడం వల్ల ఈ మైత్రి బాగా బలపడి ఎంతో అత్మీయంగా కొనసాగుతుంది. ఇక అదే ట్రెండ్ ను తమిళ చిత్ర పరిశ్రమ కూడా కొనసాగిస్తుంది. ఇప్పటికీ మెగాస్టార్ తో “స్టాలిన్” తీసిన మురుగుదాస్ ప్రిన్స్ మహేష్ తో మరో డైరెక్ట్ తెలుగు చిత్రానికి సన్నాహాలు చేస్తుండగా, మనం వంటి అచ్చ తెలుగు సినిమాను అందించిన విక్రం కె కుమార్ తమిళనాట స్టార్ హీరో సూర్య తో 24సినిమా చేస్తూ “ఆ ఊరికి ఈ ఊరు ఎంత దగ్గరో..ఈ ఊరికి ఆ ఊరుకు అనే దగ్గర” అన్నట్లుగా మైత్రిని నెలకొల్పుతుండగా, మరో క్రమంలో తమిళ దర్శకుడు లింగుస్వామి తో మన బన్నీ ఒక సినిమా చేస్తున్న వార్తలు సైతం వస్తున్నాయి. ఇక మన్మధుడు నాగ్, తమిళ హీరో కార్తీ కలిసి ఇప్పటికే వంశీపైడిపల్లి దర్శకత్వంలో ‘ఊపిరి’లో కనిపిస్తున్నారు. వీటన్నింటికన్నా పవర్ స్టార్ కరియర్ ను మలుపు తిప్పిన ఎస్.జె సూర్య ఖుషి చిత్రం సీక్వెల్ కి పధకం రచిస్తున్నట్లు తమిళ తంబీల నుంచి వినిపిస్తున్న వాదన.
మరి ఈ మైత్రి ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో మరిన్ని మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయంగా చెప్పవచ్చు.