టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న దర్శకులు చాలా మంది ఉన్నారు . అయితే వారిలో ఒక్కొక్కరూ ఒక్కో టైప్ సినిమాలతో మంచి హిట్స్ ఇస్తున్నారు. అయితే అందరూ కాకపోయినా కొందరు దర్శకులు మాత్రం ప్రత్యేకం అని చెప్పుకోవాలి. దానికి కారణం ఏంటంటే, బడా దర్శకులు అయినటువంటి పూరీ జగన్నాధ్, రామ్ గోపాల్ వర్మ, మరో పక్క చోటా దర్శకులు అయినటువంటి మారుతి, తిరుమల వెంకటేష్ వీళ్లంతా మంచి దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు. అయితే అందరి దర్శకుల్లాగా కాకుండా వీళ్లంతా ఒకేసారి రెండు సినిమాలు చేసేస్తున్నారు. అదేంటి ఒకే సారి ఎలా అనేగా, ఒక సినిమాకు పనిచేస్తూనే మరో సినిమా కధ, కధనం పై పనిచెయ్యడం, ఒక సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి ఉండగానే మరో సినిమాను మరో హీరోతో చేసేందుకు ఒప్పించడం. తాజాగా పూరీ జగన్నాధ్ విషయానికే వస్తే రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు నందమూరి హీరోలకు కధ చెప్పి ఒప్పించేసాడని టాక్. మరో పక్క యువ దర్శకుడు మారుతి కూడా, వెంకీతో సినిమా చేస్తూనే చెర్రీతో మరో సినిమాకి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక బోయపాటి బన్నీని షూట్ చేస్తూ బాలయ్య తనయుడి ఎంట్రీకోసం భారీ ప్లాన్ ను సిద్దం చేస్తున్నట్లు తెలుస్తుంది. అదే క్రమంలో కొత్త దర్శకుడు తిరుమల వెంకటేష్ కూడా నేను శైలజా సినిమాతో హిట్ అందుకుని, నితిన్ బ్యానర్ లో ఒక సినిమా, అటుపై వెంకీతో ఒక సినిమాకు ప్లాన్లో ఉన్నాడు. ఇలా ప్రస్తుతం దర్శకుల్లో కొందరు సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుడుతూ దూసుకుపోతున్నారు.