హీరోగా, నటుడిగా శరత్ కుమార్ తెలుగు, తమిళ అభిమానుల మనసులు గెలుచుకున్నారు. అతని కూతురు వరలక్ష్మి కూడా తండ్రి తగ్గ తనయురాలిగా ప్రశంసలు అందుకుంటోంది. విక్రమ్ వేదా, సత్య సినిమాల్లో అద్భుతంగా నటించి అభినందనలు అందుకున్న ఈ బ్యూటీ తాజాగా మరో అవకాశాన్ని పట్టేసింది. మారికి సీక్వెల్గా ధనుష్ మారి-2 చేయనున్నారు. బాలాజీ మోహన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ”మారి-2”లో సాయిపల్లవి హీరోయిన్ గా ఎంపికైంది.
ఇందులో పవర్ ఫుల్ పాత్ర ఉంది. ఆ పాత్రకు వరలక్ష్మిని తీసుకున్నారు. ఇది ఆమె కెరీర్ బెస్ట్ క్యారెక్టర్ గా నిలిచి పోతుందని కోలీవుడ్ సినీ వర్గాలు తెలిపాయి. వండర్ బేర్ ఫిలిమ్స్ పతాకంపై ధనుష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విలన్ గా టోవినో థామస్ కనిపించనున్నారు. ఏకకాలంలో తెలుగు, తమిళంలో నిర్మితం కానున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ధనుష్ గత చిత్రం వి ఐ పీ 2 అపజయం కావడంతో.. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని శ్రమిస్తున్నారు.