దర్శక దిగ్గజం రాఘవేంద్రరావు దర్శకత్వ ప్రతిభ గురించి వేరే చెప్పుకోనవసరం లేదు. ఒకటా…రెండా….ఎన్నో ఆణిముత్యాలను మనకు అందించి అలరించారు మన దర్శకులు. అయితే అలాంటి దర్శకుడు, నటిస్తాడంటే ఎవరైన నమ్ముతారా?? ఎంతో మంది దర్శకులు తెరలై కనిపించాలని ఎన్నో కలలు కంటూ, తమ సినిమాలో అక్కడక్కడా తళుక్కున మెరుస్తూ ఉంటారు, ఇక బడా దర్శకులు అయినటువంటి కే.విశ్వనాధ్, దర్శకరత్న దాసరి, రాజమౌళి అందరూ తమకు వీలైనంతలో తెరపై కనిపించినవారే. కానీ మన రాఘవేంద్రరావు మాత్రం ఎక్కడా అలాంటి సాహసం చెయ్యలేదు. అంతవరకూ ఎందుకు ఆయన మాట్లాడడమే తక్కువ. అయితే ఇదంతా గతం, ఇప్పుడు పరిస్థితి మారింది, రిటైర్ స్టేజ్ లో ఉన్న ఈ దర్శకుడు తన అంతరంగాన్ని ఆవిష్కరించే పనిలో ఒక టీవీ షో చేశారు, దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అటుపై టీ.టీ.డీలో కూడా కీలక సభ్యుడిగా ఉన్నారు. ఇక ఎప్పుడూ లేని విధంగా అప్పుడప్పుడూ స్టేజ్ ల పై మాట్లాడుతున్నారు. అలాంటి మన దర్శక దిగ్గజానికి నటించే అవకాశం వచ్చింది. అదేమిటంటే రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు ఓ సినిమా నిర్మిస్తున్నాడు, ఆ సినిమా పేరు ‘శతమానం భవతి ‘. అయితే ఆ సినిమాలో ఓ మంచి పాత్ర ఉందని.. దానికి దర్శకుడు రాఘవేంద్రరావు సూటవుతారని దర్శక నిర్మాతలు భావించారట. ఆయన్ని సంప్రదించడం కూడా జరిగిందట. ఐతే రాఘవేంద్రరావు ఏ విషయం తేల్చకుండా స్క్రిప్ట్ చదివి చెబుతా అన్నారట. మరి నిజంగా ఆ స్క్రిప్ట్ నచ్చింటే మన దర్శకుడు నటుడుగా సినీ రంగా ప్రవేశం చేసినట్లే. ఇక మరో పక్క ఆయనకు స్క్రిప్టు కచ్చితంగా నచ్చుతుందని, ఆయన ఈ పాత్ర చేయడానికి అంగీకరిస్తారని ఆశతో ఉన్నారు దర్శకుడు రాజు వేగేశ్న. మరి దర్శక నిర్మాతల కల ఫలిస్తుందా? మన దర్శకేంద్రుడు నటన మనం చూస్ భాగ్యం కలుగుతుందా అనేది వేచి చూడాల్సిందే.