నిర్మాత అంటే సినిమాకు డబ్బు పెట్టేవాడు. అయితే ఒకప్పటి నిర్మాతలు సినిమాకు డబ్బు పెడుతూనే, అసలు సినిమా కధ ఏంటి, సినిమా ఎలా తీస్తున్నాడు, ఎంత ఖర్చు అవుతుంది ఇలా అన్ని విషయాలు దగ్గరుండి చూసుకునే వారు. ఇక సినిమా హిట్ అయితే వచ్చిన లాబాలతో మారో మంచి సినిమాకు శ్రీకారం చుట్టేవారు. ఇది ఒకప్పటి తరం, ఇప్పుడు కాలం మారింది, సినిమా అంటే కేవలం వ్యాపారం, ఎంత పెడుతున్నాం, ఎంతకు అమ్ముడు పోతుంది, ఎంత మిగులుతుంది, ఇక సినిమా ఫ్లాప్ అయితే ఎంత నష్టం వస్తుంది, ఇదే ఇప్పటి నిర్మాత లెక్క. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఒక సినిమా డిజాస్టర్ అయ్యి నష్టం వచ్చినా వెంటనే మరో బడా హీరోతో సినిమా చెయ్యడం వెనుక చాలా రహస్యాలు, కారణాలే ఉన్నాయి అని టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం. ఇప్పటి పరిస్థితుల్లో సినిమా నిర్మాత అనే వాడు కేవలం తెరపైన పేరుకోసమే తప్ప, అసలు నిర్మాతలు వేరే వారు అని, ఎన్నారైలు పెట్టుబడులు పెడుతూ, తమ పేరు బయటకు రాకుండా తాము సంపాదిస్తున్న బ్ల్యాక్ మనీ ని వైట్ గా మార్చుకునే పద్దతిలో ఇలా సినిమా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి అని, అంతేకాకుండా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, రౌడీలు, గూండాలు ఇలా ఎన్నో లావాదేవీల్లో అవకతవకలు చేసిన వాళ్ళు కూడా వెనుకనుండి సినిమాను శాసిస్తున్నారు. అందుకే ప్రస్తుతం 10% సక్సెస్ రేట్ ఉన్నప్పటికీ నిర్మాతలు ఎవ్వరూ భయపడకుండా సినిమా వెనుక, మరో సినిమా, అదీ బడా హీరోలతో ప్లాన్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ నిర్మాణ మాఫియా జగం ఎరిగిన సత్యమే అయినప్పటికీ దీనిని ఎవ్వరూ ప్రశ్నించే ధైర్యం మాత్రం చేయరు. ఇది ఇలానే కొనసాగితే సినీ పరిశ్రమకు ఇబ్బందులు తప్పవు అని విశ్లేషకుల భావన. చూడాలి ఈ సినీ పరిశ్రమ ఏ తీరాలకు చేరుతుందో.