నేను చెప్పింది చెయ్ తారక్ – రాజమౌళి!!!

  • February 16, 2016 / 07:27 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాలీవుడ్ జక్కన్న రాజామౌళి ఇద్దరూ మంచి స్నేహితులు, అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ హీరోల్లో జక్కన్నకు నచ్చిన ఒకే ఒక్క హీరో ఎన్టీఆర్, ఈ విషయం రాజమౌళి ఒకానొక వేదికపై స్పష్టంగా తెలిపాడు. అయితే ఇంతటి అభిమానం కలిగిన వీళ్ళిద్దరూ మనస్పద్దల వల్ల దూరంగా ఉంటున్నారు అన్న వార్త అప్పట్లో టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కెర్లు కొట్టింది. కానీ అదంతా ఫేక్ అని, వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు అని, ఇప్పటికీ వాళ్ళు చాలా క్లోస్ గా ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మధ్య వచ్చిన ఒక వార్త వీళ్ళిద్దరి స్నేహాన్ని మరింత బలపరించి, వీళ్ళిద్దరి మధ్య గొడవ అన్న రూమర్స్ కు చెక్ పెట్టింది. అదేమిటంటే టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలతో మంచి హిట్ ట్రాక్ లో ఉన్న ఎన్టీఆర్ కు మన రాజమౌళి మంచి సలహాను తెలిపాడంటా ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ చిత్రం క్యాస్టింగ్ విషయంలో మన జక్కన్న చాలా హెల్ప్ చేసాడంట. ఆ చిత్రంలో ఎక్కువ శాతం ఆర్టిస్ట్స్ మళయాళం వాళ్ళు కావడంతో, ఒక ప్రత్యేక పాత్ర కోసం ఆర్టిస్ట్స్ ను వెతుకుతున్న సమయంలో జక్కన్న ఎన్టీఆర్ కు కాల్ చేసి, ఆ పాత్రకు దేవాయానిని తీసుకొమ్మని సలహా ఇవ్వగా,  ఇంక ఎన్టీఆర్ వెంటనే కొరటాలకు ఈ విషయం చెప్పగా, దర్శకుడు కూడా ఒకే అని, ఆమెను ఆ పాత్రకు ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ఇలా ఎన్టీఆర్ కు ఎప్పుడూ వెన్నంటి ఉంటూ, తన కరియర్ ను ముందుకు నడిపించే వారిలో మన జక్కన్న ఒకడు. ఏది ఏమైనా మన రాజమౌళి సూపర్ కదా.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus