టాలీవుడ్ చరిత్ర తీసుకుంటే దాదాపుగా 30ఏళ్ల నుంచి మెగా-నందమూరి ఫ్యామిలీల మధ్య పైకి కనిపించినా కనిపించనట్లుగా అనిపించే కోల్డ్ వార్ ఒకటి నడుస్తుంది. పచ్చిగా చెప్పాలి అంటే మెగా ఫ్యాన్స్- నందమూరి ఫ్యాన్స్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మంటుంది అంటే అతిశయోక్తి కాదు. ఇదిలా ఉంటే ఆ రెండు కుటుంబాలను ఒకే తాటిపై చూడాలి అనే ఆలోచన ఉన్నవారు లేకపోలేదు. ఇప్పటివరకూ ఎవ్వరూ అలాంటి సాహసం చెయ్యలేదు కానీ, ఒక ఫ్లాప్ దర్శకుడు ఈ భారీ భాధ్యతను తన నెత్తిపై వేసుకున్నాడు. అసలు కధలోకి వెళితే దర్శకుడు ఏ.ఎస్ రవి కుమార్ చౌదరి గుర్తున్నాడా….అప్పుడేపుడో “యజ్ఞం”లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత బాలయ్య లాంటి బడా హీరో అవకాశం కల్పించినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక ఇదే క్రమంలో చాలా గ్యాప్ తీసుకుని మెగా శిబిరం నుంచి వచ్చిన సాయిధర్మతేజని “పిల్లా నువ్వు లేని జీవితం”అంటూ చూపించి ఓకే అనిపించుకున్నాడు. అయితే ఆ తరువాత గోపి చంద్ తో చేసిన “సౌఖ్యం” మళ్లీ బాక్స్ ఆఫీస్ వద్ద డమాల్ మనగా ఇప్పుడు కొంచెం ఆలోచించి భారీ పన్నాగమే పన్నుతున్నాడు. నిర్మాత కే.ఎస్. రామరావును ఒప్పించి భారీ ప్రాజెక్ట్ కి ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. ఒక స్క్రిప్ట్ చెప్పి ఈ సినిమాకు ఇద్దరు యువ హీరోలు కావాలని, ఆ యువ హీరోలు “సాయి ధర్మ తేజ”. నందమూరి కల్యాణ్ రామ్ అయితే బావుంటుంది అని తెలిపాడు. ఇక ఈ కధను కల్యాణ్ రామ్ కు అందించినా ఆయన నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఇక్కడ అర్ధం కానీ విషయం ఏమిటంటే దర్శకుడు రవి కుమార్ ఈ ఇద్దరి హీరోలనే ఎందుకు ఎంచుకున్నాడో…..బహుశా…ఇటు మెగా, అటు నందమూరి అభిమానులు చూస్తే చాలు సినిమా సూపర్ హిట్ అయిపోతుందని ఏమైనా కలగన్నాడో ఏంటో. ఏది ఏమైనా…ఫలితం విషయం పక్కన పెడితే…..ఆ రెండు ఫ్యామిలీస్ ను ఒకే సినిమాలో చూపించాలి అన్న రవి కుమార్ ఆలోచన నిజంగా సంతోషించాల్సిన విషయమే.