ఒకప్పటి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కి సెపరేట్ డ్యాన్సర్స్ ఉండేవారు. సినిమాలో హీరోయిన్ అంటే మంచి పాత్ర, పాత్రకు తగ్గట్టు నటన, ఇక పాటల్లో అందంగా కనిపిస్తూ హీరోతో ఆడిపాడటం వరకే పరిమితం. కానీ తరం మారింది, తత్వం కూడా మారింది, ఇప్పటికీ ఐటమ్ సాంగ్స్ కు డిమాండ్ ఉన్నా, వాటికి ప్రత్యేకంగా మాత్రం డ్యాన్సర్స్ అవసరం లేదు, ఎందుకంటే సినిమా హీరోయిన్స్ సైతం అలాంటి పాటలకు సై అంటుంటే ఇక మళ్లీ ప్రత్యేకంగా వెతుక్కోవాల్సిన పని ఏముంది. ఇదిలా ఉంటే, తాజా సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు బరువు, పరువు రెండూ తగ్గిపోయాయి, హీరోయిన్ అంటే హీరోతో రొమ్యాన్స్ చెయ్యడం, పాటల్లో చిట్టి పొట్టి బట్టలతో కనిపించడం, అక్కడెక్కడైనా హీరోతో ఒక లిప్ లాక్ ఇదే హీరోయిన్ పాత్ర సినిమాలో. ఇక అసలు కధ విషాయానికి వస్తే తాజాగా గోపి చంద్ నటిస్తున్న ‘ఆక్సిజన్’ చిత్రంలో రెండో హీరోయిన్ గా నటిస్తున్న యూ.కే భామ ఇమానుయేల్ శృంగార సన్నివేశాల్లో శ్రుతి మించి మరీ ఇరగదీస్తుందని టాలీవుడ్ నుంచి వస్తున్న టాక్, హీరోతో, రొమ్యాన్స్ విషయంలో, లిప్ లాక్ సీన్స్ లో, బెడ్ సీన్స్‌లో అస్సలు ఏ మాత్రం బెరుకు లేకుండా దుమ్ము దులిపేస్తుందట. ఆమె దూకుడు చూసి దర్శక నిర్మాతలు సైతం ఖంగుతిన్నారంటే ఆలోచించాలి ఈ భామ స్పీడ్ ఎలా ఉందో. ఇక మరో పక్క ఈ స్పీడ్ ఇలానే కొనసాగితే మాత్రం టాలీవుడ్ లో ఈ భామకు అవకాశాలు క్యూ కడతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏది ఏమైనా….చూసుకున్నోడికి చూసుకున్నంత అన్నారుగా పెద్దలు. అది ఇదేనేమో.