పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ ఇంకా పూర్తి కాక ముందే ఆ సినిమా కొనేందుకు బయ్యర్స్ భారీ అమౌంట్ తో క్యూలు కడుతూ ఉన్నారు. అయితే బయ్యర్స్ నుంచి వస్తున్న స్పందన చూసి నిర్మాతలు సినిమా ఇస్తాం కానీ, ఒక కండీషన్ అంటున్నారని తెలుస్తుంది. ఇంతకీ ఆ కండీషన్ ఏంటంటే….ఈ సినిమాకు ముందుకు ఎవరైతే అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చి బుక్ చేసుకుంటారో, ఆ అడ్వాన్స్ అమౌంట్ “నాన్ రిఫండబల్” అంటూ చెప్పారంట, కానీ ఈ నోట్ ని అగ్రీమెంట్ లో మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదని తెలుస్తుంది.
ఇక ఇదిలా ఉంటే సినిమాపై ఎంత నమ్మకం, భరోసా ఉంటే మాత్రం నిర్మాతలు ఇలాంటి కండీషన్స్ పెట్టడం ఎంతవరకూ న్యాయం అని కొందరు అంటుంటే, కాదు కాదు, ఈ సినిమాలో మ్యాటర్ లేకపోవడం వల్ల సినిమాను అమ్ముకునే ప్రయత్నంలో భాగంగానే ఇలా అంటున్నార్ అన్న కొమెంట్స్ కూడా బలంగానే వినిపిస్తున్నాయి.
ఇక ప్రస్తుతం కేరళలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని భారీగా 80కోట్లకు ఈరోస్ సంస్థ విక్రయించినట్లు సమాచారం. ఏది ఏమైనా, సర్దార్ గబ్బర్ సింగ్ బిజినెస్ టాలీవుడ్ వాతావరణాన్ని వేడెక్కించింది అన్నది మాత్రం వాస్తవం. చూడాలి ఏం జరుగుతుందో.