Brahmastra Movie: ‘బ్రహ్మాస్త్రం’ కి నెగిటివ్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!

  • September 9, 2022 / 06:01 PM IST

ఒకప్పుడు బాలీవుడ్ అనేది పెద్ద మార్కెట్ ఉన్న ఇండస్ట్రీగా పరిగణించేవారు. కానీ ఇప్పుడు ఒక్క హిట్టు కొట్టలేక విలవిలలాడుతుంది. అయితే ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం బాలీవుడ్ కి మళ్ళీ పూర్వ వైభవం తెచ్చిపెడుతుంది అని అంతా భావించారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 9 వేల స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుంది ఈ మూవీ. సోసియో ఫాంటసీ మరియు అడ్వెంచర్ బేస్డ్ మూవీ అని ట్రైలర్ సంకేతాలు ఇచ్చింది. నాగార్జున ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించడం, రాజమౌళి ఈ చిత్రాన్ని దగ్గరుండి ప్రమోట్ చేయడం అలాగే సమర్పకుడిగా వ్యవహరించడం, మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించడం వంటివి తెలుగు ప్రేక్షకుల్లో కూడా ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. అయితే ఈరోజు సెప్టెంబర్ 9న విడుదలైన ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వస్తుంది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి :

1) ‘బ్రహ్మాస్త్రం’ కథ పరంగా బాగానే ఉంది. ఈ భూమి మీద చాలా అస్త్రాలు ఉన్నాయని, అన్నిటికీ దేవత లాంటి ‘బ్రహ్మాస్త్రం’ కీలకమని, దానిని సొంతం చేసుకుని ఈ ప్రపంచాన్ని నాశనం చేయాలనుకునే శక్తులు కూడా ఉన్నాయనేది ఈ చిత్రం కథ.కానీ ఈ కథని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడంలో దర్శకుడు అయాన్ ముఖర్జీ విఫలమయ్యాడనే చెప్పాలి.

2) ఫస్ట్ హాఫ్ కనుక చూసుకుంటే.. రణబీర్-అలియా ల మధ్య వచ్చే లవ్ సీన్స్ చాలా బోర్ కొట్టిస్తాయి. నాగార్జున ఎంట్రీ ఇచ్చే వరకు సినిమా గుల్లగా అనిపిస్తూ ఉంటుంది. చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ లో నాగార్జున ఎంట్రీ ఇచ్చాకే సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. సెకండాఫ్ పై అంచనాలు క్రియేట్ అయ్యేలా చేస్తుంది.

3) అయితే సెకండాఫ్ మొదటి నుండి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతూనే ఉంటుంది. దర్శకుడు అమితాబ్ బచ్చన్ పాత్ర ద్వారా తాను చెప్పాలనుకున్నది చెప్పడానికి ట్రై చేస్తాడు . కానీ ప్రేక్షకులకు అది ఎక్కదు.

4) ఒకప్పుడు హిందీ సినిమాలను ఒరిజినల్ వెర్షన్ లోనే తెలుగు ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేసేవారు. అయితే ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ కోసం అన్ని భాషలతో పాటు తెలుగులో కూడా డబ్ చేసి తమ సినిమాలను విడుదల చేస్తున్నారు బాలీవుడ్ మేకర్స్. ఈ క్రమంలో డబ్బింగ్ విషయంలో వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ‘బ్రహ్మాస్త్ర’ లో నాగ్ పాత్రను తప్పించి మిగిలిన అన్ని పాత్రలకు డబ్బింగ్ చాలా కామెడీగా ఉంది.

5) హీరో హీరోయిన్లు రణబీర్ కపూర్- అలియా భట్ ల లవ్ ట్రాక్ లు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోకపోగా ప్రేక్షకుల అసహనానికి దారి తీస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.

6) సౌత్ లో రాజమౌళి, శంకర్ వంటి దర్శకులు అద్భుతమైన వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ను అందించారు. ఈ విషయంలో బాలీవుడ్ చాలా వెనుక పడి ఉందని ‘బ్రహ్మాస్త్ర’ వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ను చూస్తే అర్థం చేసుకోవచ్చు. ట్రైలర్ కే ఈ విషయంలో భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది కాబట్టి.. చాలా మంది వి.ఎఫ్.ఎక్స్ వర్క్ గొప్పగా ఉండదు అని ముందే మిక్స్ అయ్యి వెళ్లారు.

7) నాగార్జున పాత్ర సినిమాలో చాలా తక్కువ నిడివి ఉండడం అతని అభిమానులను నిరపరిచే అంశం. నాగ్ ఉన్నంత వరకు సినిమా బాగుంది. ఆ పాత్రని ఇంకా ఉంచితే బాగుందనిపిస్తుంది.

8) కుంకుమల సాంగ్ తప్ప మిగిలిన అన్ని పాటలు ప్రేక్షకులకు బోర్ ఫీలింగ్ ను కలిగిస్తాయి.

9) ఎడిటింగ్ విషయంలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. సినిమా రన్ టైం ఏకంగా 2 గంటల 45 నిమిషాల వరకు ఉంది. కొంత పార్ట్ ట్రిమ్ చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా లెంగ్త్ ఎక్కువైంది అనే ఫీలింగ్ ను కలిగిస్తుంది.

10) మౌనీ రాయ్(నెగిటివ్ రోల్) పాత్రకు సరైన ఎండింగ్ ఇవ్వలేదు. గజిబిజి గందరగోళానికి గురి చేసి హడావిడిగా పార్ట్ 2 కోసం దేవ్ పాత్రని దించి సినిమాని ముగించారు కానీ.. సగటు ప్రేక్షకులకు అర్థమయ్యేలా కన్క్లూజన్ ఇవ్వలేదు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus