ఎన్టీఆర్ డైలాగ్ చెబితే మెరుపులే

  • July 6, 2016 / 02:02 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మాస్ లో మంచి క్రేజ్ ఉంది. ఆది సినిమాతో యాక్షన్ హీరోగా పేరుతెచ్చుకున్నారు. తారక్ నటనే కాదు డైలాగ్ డెలివరీ కూడా మెరుపులా ఉంటుంది. అందుకే సినిమాలో యంగ్ టైగర్ చెప్పే డైలాగ్ కోసం అభిమానుల కోసం ఎదురుచూస్తుంటారు. అతని తాజా చిత్రం ”జనతా గ్యారేజ్” లోను పవర్ ఫుల్ డైలాగులకు కొదవలేదని సమాచారం.

ఆదిఅమ్మతోడు అడ్డంగా నరికేస్తా

యమదొంగరేయ్. పులిని దూరం నుంచి చూడాలి అనిపించింది అనుకో, చూస్కో .. పులితో ఫోటో దిగాలి అనిపించింది అనుకో, కొంచం రిస్క్ అయినా పర్లేదు ట్రై చేసుకోవచ్చు. సరే చనువు ఇచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం, వేటాడేస్తది.

బృందావనంసిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా ఉన్నాడు అని అనుకుంటున్నావేమో ? కారక్టర్ కొత్తగా ఉంది అని ట్రై చేసా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దానిని బయటికి తెచ్చావనుకో.. రచ్చ..రచ్చే.

ఊసరవెల్లికరెంట్ వైర్ కూడా నా లాగా సన్నగా ఉంటది రా, దాన్నిటచ్ చేస్తే దానెమ్మ షాకే సాలిడ్ గా ఉంటుంది.

దమ్ముబతకండి బతకండి అని అంటే వినలేదు కదరా, కోత మొదలైంది, రాత రాసిన భగవంతుడు వచ్చిన ఆపలేడు

బాద్ షాబాద్ షా డిసైడ్ అయితే, వార్ ఒన్ సైడ్ అయిపోద్ది

టెంపర్ఈగో నా చుట్టూ వైఫై లా ఉంటుంది.. యూజర్ నేమ్ దయా.. పాస్ వర్డ్ పోలీస్. దమ్ముంటే నా వైఫై దాటి రండ్రా..
దండయాత్ర. ఇది దయా గాడి దండయాత్ర.

జనతా గ్యారేజ్బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ.. బట్ ఫర్ ఏ చేంజ్.. ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది. జనతా గ్యారేజ్.. ఇచట అన్ని రిపేర్లు చేయబడును

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus