Radhe Shyam Movie: ఈ 10 కారణాల వల్లే ‘రాధే శ్యామ్’ కి నెరిగిటివ్ టాక్ వచ్చింది..!
March 14, 2022 / 06:52 PM IST
|Follow Us
మార్చి 11న విడుదలైన ‘రాధే శ్యామ్’ కు మిక్స్డ్ టాక్ వచ్చింది. దీని ప్రభావం కలెక్షన్ల పై పడింది.’సాహో’ లా ఆల్ టైం రికార్డులు అందుకే నమోదు కాలేదు. అలా అని తీసిపారేసే కలెక్షన్లు కూడా కావు అవి. ప్రభాస్- పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రానికి రాధా కృష్ణకుమార్ దర్శకత్వం వహించాడు. ‘గోపికృష్ణా మూవీస్’ సంస్థతో కలిసి ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవుతుంది అనే నమ్మకం అయితే అటు చిత్ర యూనిట్ కు కానీ ప్రేక్షకులకి కానీ లేదు. అందుకు ప్రధాన కారణం మిక్స్డ్ టాక్ భయంకరంగా స్ప్రెడ్ అయ్యి ఓపెనింగ్స్ పై దెబ్బ కొట్టడమే. అయితే ‘రాధే శ్యామ్’ బాలేదు అన్నవాళ్ళు కొంతమంది అయితే, ‘రాధే శ్యామ్’ బాగుంది అన్న వాళ్ళ సంఖ్య కూడా సమానంగా ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి :
1) రాధే శ్యామ్ పాన్ ఇండియా సినిమా కాబట్టి.. పైగా రూ.300 కోట్లు పెట్టి తీశారు అనే ప్రచారం చేయడం వల్ల, ఈ మాత్రం కథకి రూ.300 కోట్లు పెట్టాల్సిన అవసరమేముంది అనేది కొందరి వాదన. నిజమే కథ డిమాండ్ చేస్తే సినిమాకి ఎంతైనా పెట్టొచ్చు. ఈ కథకి అంత డిమాండ్ చేసేది ఏముంది.
2) ప్రేమ కథ అనగానే హీరో హీరోయిన్ల మధ్య మంచి రొమాన్స్ ఉండాలి. ఈ సినిమాలో అది చాలా వరకు మిస్ అయ్యింది.
3) ప్రేమ కథ చిత్రాలకి పాటలు అనేవి ముందు నుండీ సూపర్ హిట్ అవ్వాలి. ‘రాధే శ్యామ్’ పాటలు బాగానే ఉన్నాయి, కానీ అవి అన్ని వర్గాల ప్రేక్షకుల నోట్లో నానలేదు. పాన్ ఇండియా సినిమా అన్నంత మాత్రాన పక్క రాష్ట్రాల్లో ఇంకో సంగీత దర్శకులు అవసరం లేదు.’బాహుబలి'(సిరీస్), ‘కె.జి.ఎఫ్ చాప్టర్1’ ‘పుష్ప’.. ఈ సినిమాలకి పక్క భాషల్లో వేరే సంగీత దర్శకులను ఏమీ పెట్టుకోలేదు. కానీ అన్ని భాషల్లోని ప్రేక్షకులను ఈ పాటలు ఆకట్టుకున్నాయి.
4) ప్రభాస్ ఇమేజ్ కు సరిపడా కథ ఇది కాదు అని చాలా మంది అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. సినిమాకి వచ్చేసరికి అతను ప్రధాన పాత్రదారి అనాలి. ఏ నటుడు అయినా అన్ని జోనర్లలో సినిమాలు చేయాలి. ప్రభాస్ చేసిందాంట్లో తప్పేమి లేదు. కాకపోతే అతను ఈ స్క్రిప్ట్ ను గుడ్డిగా నమ్మేసి దర్శకుడికి నిర్మాతలకి అప్పగించేసినట్టు అనిపిస్తుంది. మరీ అంతలా కూడా ఉండకూడదు. హాస్పిటల్ లో అతను చేసిన కామెడీ… సినిమాకి ముఖ్యమైనది ఏమీ కాదు. ఇలాంటి వేస్ట్ సీన్లు ఇంకా ఉన్నాయి సినిమాలో..! కాబట్టి తనకి ఏది సూట్ అవుతుందో దర్శకుడితో ఒకటికి రెండు సార్లు డిస్కస్ చేసుకోవాలి.
5) సినిమాలో ఒక్క ఫైట్ లేదు, మాస్ ప్రేక్షకుల్ని అలరించే అంశాలు ఏమాత్రం లేవు. ప్రభాస్ నుండీ ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీ ఆడియెన్స్ కానీ ఆశించేవే ఇవి. ఇది తప్పు అనలేం కానీ నెగిటివ్ టాక్ రావడానికి ఇదొక కారణం.
6) సినిమా సెకండ్ హాఫ్ లో ఓ సీన్ ఉంటుంది. పేపర్ పై కొంతమంది చేతి ముద్రలు చూసి హీరో వాళ్ళ బయోగ్రఫీ తో సహా చెప్పేస్తాడు. వాళ్ళంతా చనిపోయారు అని అందులో ఓ అమ్మాయి ప్రెగ్నెంట్ అని కూడా చెబుతాడు. ఇంత తెలిసిన హీరోకి.. హీరోయిన్ జబ్బుతో బాధపడుతుంది అని తెలీకుండానే ఆమెకి ఎక్కువ ఆయుష్షు ఉంది అని ఎలా చెబుతాడు.
7) జగపతి బాబు ట్రాక్ ఫస్ట్ హాఫ్ లో ఓకె.. సెకండ్ హాఫ్ లో కూడా ఎందుకు చూపించినట్టు.
8) హీరో ఓ పామిస్ట్.. అతను ఇండియాలో ఉండకుండా విదేశాల్లో చక్కర్లు కొడుతుంటాడు. దానికి కారణం ఏంటనేది మాత్రం దర్శకుడు చెప్పలేదు.
9) సినిమాలో చివరికి పామ్ హిస్టరీ నిజమైనట్టా.. లేక అది సైన్స్ అని ప్రూవ్ చేసినట్టా? అనే విషయం పై కూడా క్లారిటీ ఇవ్వలేదు.
10) ఈ సినిమా కథ చాలా టిపికల్ గా ఉంటుంది. ఇలాంటి సినిమాని రూ.150 కోట్ల బడ్జెట్ లో తీస్తే.. ప్రభాస్ ఇమేజ్ తో సూపర్ హిట్ అవ్వుద్ది. అది దర్శకుడి లోపమో లేక నిర్మాతల లోపమో తెలీదు కానీ.. దానికి డబుల్ బడ్జెట్ అయ్యిందని చెబుతున్నారు. పాన్ ఇండియా మూవీ అన్నప్పుడు అన్ని భాషల్లోని ప్రేక్షకులకి ఒకే టేస్ట్ ఉండదు. అన్ని భాషల్లో ఉన్న ప్రేక్షకుల్ని మెప్పించేలా సినిమా కథనం ఉండాలి. ‘రాధే శ్యామ్’ లో ప్రప్రధమంగా అదే లోపించింది.