నెగిటివ్ రోల్స్ చేసిన స్టార్ హీరోల సినిమాలు.. మరియు వాటి ఫలితాలు!

  • March 11, 2023 / 07:22 PM IST

హీరో అంటే సినిమా ప్రారంభమైన 15 నిమిషాలకు ఇంట్రడక్షన్ ఉండాలి.. మొదటి ఫైట్ కు 20 మందిని కొట్టాలి.. ఆ తర్వాత రాముడు మంచి బాలుడు అనే తరహాలో ప్రవర్తించాలి.. సెకండ్ సాంగ్ వచ్చేసరికి హీరోయిన్ ని ప్రేమలో పడేయాలి… ఇంటర్వెల్ కు భారీగా ఓ ఫైట్ చేసి భీభత్సం సృష్టించాలి. ఇక సెకండ్ హాఫ్ లో అయితే అతనికి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉండాలి.. తర్వాత అతని పక్కనున్న వాళ్ళు సలాం కొట్టాలి.. క్లైమాక్స్ కు మళ్ళీ ఫైట్ చేసి భీభత్సం సృష్టించి శుభం కార్డు వేయించుకోవాలి. దాదాపు 4 దశాబ్దాలుగా ఇదే హీరోయిజం చూశాం. కానీ ఇప్పుడు పంధా మారింది. అభిమానులకే కాదు హీరోలకు కూడా అలా కనిపించడం ఇష్టం లేదు. అందుకే హీరో ఒక బ్యాడ్ బాయ్ ఎందుకు కాకూడదు. అతనిలో నెగిటివ్ షేడ్స్ ఎందుకు ఉండకూడదు అనుకుంటూ కథల్ని ఎంచుకుంటున్నారు. కొంతమంది హీరోలు నెగిటివ్ రోల్స్ చేసి కూడా శభాష్ అనిపించారు. వాళ్ళు ఎవరో .. వాళ్ళు నెగిటివ్ రోల్స్ చేసిన సినిమాలు హిట్టయ్యాయో.. ప్లాప్ అయ్యాయో ఓ లుక్కేద్దాం రండి :

1) బాలకృష్ణ :

‘యువరత్న రాణా’, ‘సుల్తాన్’… అనే సినిమాల్లో బాలకృష్ణ నెగిటివ్ రోల్స్ చేశాడు. స్టార్ ఇమేజ్ ఉండగా ఇలాంటి రోల్స్ చేయడం చాలా రిస్క్. కానీ బాలయ్య అవలీలగా చేసేశాడు. కానీ ఈ సినిమాలు ఆడలేదు.

2) పవన్ కళ్యాణ్ :

కరుణాకరణ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన రెండో సినిమా ‘బాలు’. ఈ మూవీలో ‘గని’ అనే పాత్రలో చాలా క్రూయల్ గా కనిపిస్తాడు పవన్ కళ్యాణ్. అయితే హీరోయిన్ ప్రేమ వల్ల అతను మంచి మనిషిగా మారతాడు. సినిమా అయితే యావరేజ్ గా ఆడింది అంతే..! కానీ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ‘హట్ హట్ జా’ సాంగ్ మాత్రం ఓ రేంజ్ లో ఉంటుంది.

3) వెంకటేష్ :

‘కలియుగ పాండవులు’ ‘జెమిని’ ‘నాగవల్లి’ వంటి సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేశాడు వెంకటేష్. కానీ ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

4) నాగార్జున :

‘విక్రమ్’ ‘కిల్లర్’ ‘గ్రీకు వీరుడు’ ‘మన్మధుడు 2’ వంటి సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేసి మెప్పించాడు నాగార్జున. కానీ ఈ సినిమాలు కూడా ఆడలేదు.

5) మహేష్ బాబు :

‘బిజినెస్ మెన్’ సినిమాలో కంప్లీట్ నెగిటివ్ రోల్ లో కనిపించి తన నటనతో మెప్పించాడు మహేష్. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

6) ప్రభాస్ :

‘బిల్లా’ సినిమాలో నెగిటివ్ రోల్ లో చాలా క్రూయల్ గా అదే సమయంలో చాలా స్టైలిష్ గా కనిపించి మెప్పించాడు ప్రభాస్. ఆ సినిమా యావరేజ్ గా ఆడింది. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ లో కూడా నెగిటివ్ రోల్లోనే కనిపిస్తాడు కానీ అంత వయోలెన్స్ ఉండదు. సినిమా కూడా బాగా ఆడింది.

7) అల్లు అర్జున్ :

‘ఆర్య 2’ ‘పుష్ప'(ది రైజ్) వంటి సినిమాల్లో అల్లు అర్జున్ పాత్ర నెగిటివ్ గానే ఉంటుంది. ‘ఆర్య2’ అంతగా ఆడలేదు కానీ ‘పుష్ప’ బాగా ఆడింది.

8) ఎన్టీఆర్ :

‘టెంపర్’ ‘జై లవ కుశ'(జై అలియాస్ రావణ్ పాత్ర) సినిమాల్లో నెగిటివ్ రోల్స్ ప్లే చేసి తన నటనతో ఫిదా చేశాడు ఎన్టీఆర్. రెండు సినిమాలు బాగానే ఆడాయి.

9) రవితేజ :

‘దరువు'(హోమ్ మినిస్టర్ రోల్) ‘ఖిలాడి’ ‘రావణాసుర’ సినిమాల్లో నెగిటివ్ రోల్స్ ప్లే చేశాడు రవితేజ. ఇందులో ‘దరువు’ ‘ఖిలాడి’ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.. ‘రావణాసుర’ ఏమవుతుందో చూడాలి..!

10) రామ్ :

‘ఇస్మార్ట్ శంకర్’ మూవీలో కంప్లీట్ బ్యాడ్ బాయ్ రోల్ లో కనిపిస్తాడు రామ్. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus