ఈసారైనా నెట్ ఫ్లిక్స్ కి వర్కవుట్ అవుతుందా..?

  • March 16, 2021 / 07:24 PM IST

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి’ సినిమా ఇండియన్ సినిమా స్థాయిని పెంచేసింది. ‘బాహుబలి 1’, ‘బాహుబలి 2’ రెండు సినిమాలు వందల కోట్లు కొల్లగొట్టాయి. ఒక్క ‘బాహుబలి 2’ సినిమా దాదాపు రెండు వేల కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. దీంతో బాహుబలి సినిమాను బ్రాండ్ గా భావించిన నెట్ ఫ్లిక్స్ సంస్థ బాహుబలి సిరీస్ ను నిర్మించాలని నిర్ణయించుకుంది. దీనికోసం రూ.100 కోట్ల బడ్జెట్ కూడా కేటాయించింది. రాజమౌళి విజన్ లో దర్శకులు ప్రవీణ్ సత్తారు,

దేవా కట్టా కలిసి బాహుబలి వెబ్ సిరీస్ ను మొదలుపెట్టారు. అయితే వీరు రూపొందించిన సిరీస్ అవుట్ ఫుట్ నెట్ ఫ్లిక్స్ సంస్థకి నచ్చలేదు. దాంతో ఆ మొత్తం 100 కోట్ల బడ్జెట్ తో తీసిన వెబ్ సిరీస్ ని పక్కన పెట్టేసింది. ఇప్పుడు వేరే టీమ్ తో మళ్లీ ఫ్రెష్ గా వెబ్ సిరీస్ ని నిర్మించడానికి సిద్ధమవుతోంది. ఈసారి మొత్తం 200 కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించినట్లు తెలుస్తోంది.

అంటే ఈ ఒక్క వెబ్ సిరీస్ కోసమే నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టిందన్నమాట. ఈ ఒక్క సిరీస్ కోసం ఇంత మొత్తంలో పెట్టుబడులు పెట్టడం మామూలు విషయం కాదు. కానీ నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సిరీస్ ని ప్రెస్టీజియస్ గా తీసుకుంది. ఆ కారణంగానే మంచి అవుట్ ఫుట్ తో సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తుంది.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus