వీరికి సినిమాలే ఇంటి పేర్లు అయ్యాయి

  • February 12, 2018 / 12:44 PM IST

ఇంట్లో ముద్దు పేర్లుంటాయి. కాలేజీలో నిక్ నేమ్స్ ఉంటాయి. సినిమా స్టార్స్ కి బిరుదులు ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా కొంతమందికి సినిమా పేర్లుంటాయి. అంటే సినిమాలో నటించిన పాత్ర పేరు కాదు. సినిమా పేరే ఇంటిపేరుగా మార్చుకున్న సినీ సెలబ్రిటీలు తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది ఉన్నారు. అటువంటి వారిపై ఫోకస్..

షావుకారు జానకిసీనియర్ నటి జానకి 1949 లో షావుకారు అనే సినిమా ద్వారా వెండితెరకి పరిచయమయ్యారు. ఇందులో ఆమె పోషించిన సుబ్బులు పాత్ర అందరికి తెగ నచ్చింది. దీంతో అప్పటి నుంచి ఆమె షావుకారు జానకి అయ్యారు.

శుభలేఖ సుధాకర్మెగాస్టార్ చిరంజీవి సినిమా శుభలేఖలో సుధాకర్ తొలిసారి నటించారు. ఆ సినిమా మంచి హిట్ కావడంతో శుభలేఖ సుధాకర్ గా పేరు నిలబడిపోయింది.

సాక్షి రంగారావుసాక్షి రంగారావు పూర్తి పేరు రంగవఝుల రంగారావు. ఈయన నటించిన మొదటి సినిమా సాక్షి. 1967లో విడుదలైన బాపూ-రమణల సాక్షి అతని ఇంటిపేరు అయిపోయింది.

ఆహుతి ప్రసాద్అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్ అనే నటుడు.. రెండు సినిమాల్లో నటించారు. ఆహుతి చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో ఆహుతి ప్రసాద్ గా చివరి వరకు కొనసాగారు.

అల్లరి నరేష్ఈవీవీ సత్యనారాయణ చిన్న కొడుకు ఈవీవీ నరేష్ కాస్త అతని మొదటి చిత్రం అల్లరి తర్వాత అల్ల్లరి నరేష్ అయిపోయారు.

వెన్నెల కిషోర్సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బొక్కల కిషోర్ కుమార్ వెన్నెల సినిమాతో వెన్నెల కిషోర్ గా మారిపోయారు. వెన్నెల చిత్రంలో ఖాదర్ గా అతని నటన అందరినీ నవ్వించింది. కిషోర్ కి గుర్తింపు నిచ్చింది.

సత్యం రాజేష్రాజేష్ బాబు సత్యం సినిమాకి ముందు మూడు సినిమాల్లో నటించారు. అయితే సత్యం చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అతను సత్యం రాజేష్ గా పేరు దక్కించుకున్నారు.

చిత్రం శ్రీనుచిత్రం శ్రీను అసలు పేరు శ్రీనివాసులు. దర్శకుడు తేజ తన తొలి చిత్రమైన చిత్రం ద్వారా ఇతడిని తెలుగు తెరకు పరిచయం చేసాడు. ఆ చిత్ర విజయంతో ఇతని పేరు చిత్రం శ్రీనుగా స్థిరపడి పోయింది.

కిక్ శ్యామ్తమిళ నటుడు శ్యామ్ సుధీమ్ ఇబ్రహీం కాస్త కిక్ సినిమా ద్వారా కిక్ శ్యామ్ గా మారిపోయారు. ఇందులో అతని నటన తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. అందుకే టాలీవుడ్ లో కిక్ శ్యామ్ గా కొనసాగుతున్నారు.

దిల్ రాజుదిల్ రాజు అసలు పేరు వి.వెంకట రమణా రెడ్డి. డిస్ట్రిబ్యూటర్ అనేక సినిమాలను పంపిణీచేసిన ఇతను శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగు లో దిల్ అనే సినిమా తీశారు. అది హిట్ కావడంతో రాజుకి ఇంటి పేరుగా దిల్ అయింది.

ఠాగూర్ మధుమెగాస్టార్ చిరంజీవి హిట్ సినిమాని బి. మధు నిర్మించారు. ఈ ఒక్క సినిమాతో సినీ జనాలకు ఠాగూర్ మధుగా ముద్రపడిపోయారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus