కోలీవుడ్ పై దండయాత్ర చేస్తున్న ఐటీ అధికారులు.. ఏకంగా రూ.13 కోట్లు సీజ్..!
August 4, 2022 / 02:19 PM IST
|Follow Us
స్టార్ హీరోలు, నిర్మాతలు వంటి వారి ఇళ్లు, ఆఫీసుల పై ఇన్కమ్ టాక్స్ అధికారులు అప్పుడప్పుడు రైడ్ చేస్తూ ఉంటారు. టాక్స్ సరిగ్గా చెల్లించకపోయినప్పుడు ఇలాంటి రైడ్స్ వారు జరుపుతూ ఉంటారు. గతంలో మహేష్ బాబు, హీరో నాని, సితార ఎంటర్టైన్మెంట్స్, తమిళ స్టార్ హీరో విజయ్,కె.జి.ఎఫ్ హీరో యష్ వంటి వారి ఇల్లు, ఆఫీస్ లపై ఆదాయపన్ను శాఖ దాడులు చేసిన సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న కోలీవుడ్ బడా నిర్మాతలను టార్గెట్ చేసి వారి ఇల్లు ఆఫీస్ ల పై సోదాలు నిర్వహించారు ఇన్కమ్ టాక్స్ అధికారులు.
కలైపులి ఎస్. థాను తో సహా ఇంకో 10 మంది నిర్మాతలు, ఫైనాన్సియర్ల కార్యాలయాలపై మంగళవారం నాడు సోదాలు నిర్వహించింది ఇన్కమ్ టాక్స్ బృందం. ఈ నేపథ్యంలో రూ.13 కోట్ల కరెన్సీ పట్టుబడినట్టు సమాచారం. అంతేకాదు ఈ రైడ్స్ లో భాగంగా చాలా అక్రమ లావాదేవీలు వెలుగు చూశాయని కూడా తెలుస్తుంది. పలు బ్లాక్ బస్టర్ సినిమాలకు ఫైనాన్స్ చేసి లేదా నిర్మించి వందల కోట్లు లబ్ది పొందిన కోలీవుడ్ సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున ఆదాయపు పన్ను ఎగవేసినట్లు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ తెలియజేసింది.
తమకు సమాచారం అందిన వెంటనే తమిళనాడు రాష్ట్రంలో మంగళవారం నాడు 40 చోట్ల సోదాలు నిర్వహించినట్టు వారు తెలియజేశారు. ఈ సోదాలు బుధవారం నాడు కూడా కొనసాగించినట్లు కూడా వారు చెప్పుకొచ్చారు. చెన్నై, మదురై జిల్లాల్లోని ఫైనాన్షియర్లు అన్బుచెళియన్, జ్ఞానవేల్రాజా, ఎస్ఆర్ ప్రభు, నిర్మాత కలైపులి థాను వంటి వారి ఆఫీసుల్లో 100 మంది టీంతో వెళ్లి సోదాలు నిర్వహించారని ఇన్కమ్ టాక్స్ అధికారులు వెల్లడించారు.