తెలుగు చిత్రాల్లో కథానాయికలు పరిచయమయ్యే పాటలు

  • April 17, 2018 / 01:13 PM IST

కమర్షియల్ సినిమా అనగానే హీరో ఇంట్రడక్షన్ సూపర్ గా ఉండాలి. అందుకే మంచి ఫైట్ గానీ.. సాంగ్ గానీ పెడుతుంటారు. హీరోయిన్స్ ని ఒక అందమైన సీన్ తో పరిచయం చేస్తుంటారు. అతి తక్కువమంది మాత్రమే హీరోయిన్స్ కి ఇంట్రడక్షన్ సాంగ్స్ పెడుతుంటారు. ఇప్పటివరకు వచ్చిన హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్స్ పై ఫోకస్..

సిరిమల్లె పూవ (పదహారేళ్ల వయసు)

కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన పదహారేళ్ల వయసు సినిమాలో సిరిమల్లె పూవ పాటతో శ్రీదేవి పరిచయం అవుతుంది. అందాల శ్రీదేవి ఈ పాటకి మరింత అందాన్ని తెచ్చింది.

చిన్ని చిన్ని ఆశ (రోజా)

ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన అద్భుతమైన పాటల్లో చిన్ని చిన్ని ఆశ ఒకటి. రోజా సినిమాలో హీరోయిన్ ని ఈ పాటతో పరిచయం అవుతుంది.

గ్రీకు వీరుడు (నిన్నే పెళ్లాడతా)

ఒక అమ్మాయి తనకు కాబోయే భర్త గురించి ఎలా కలలు కంటుందో నిన్నే పెళ్లాడతా సినిమాలో గ్రీకు వీరుడు పాట ద్వారా కృష్ణవంశీ చూపించారు.

పలికే గోరింకా (ప్రియురాలు పిలిచింది)

ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ పరిశ్రమలోకి వచ్చిన కొత్తల్లో చేసిన మూవీ “ప్రియురాలు పిలిచింది”. ఇందులో ఆమెకి పలికే గోరింకా అనే ఇంట్రడక్షన్ సాంగ్ ఉంది.

రహాతుల్లా రహాతుల్లా ( గజిని)

హరీష్ జయ రాజ్ ట్యూన్స్ భిన్నంగా అంటాయి. అతను మ్యూజిక్ అందించిన గజినీ లో “రహాతుల్లా రహాతుల్లా”సాంగ్ బెస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ గా నిలిచింది. ఈ పాటలో ఆసిన్ అదరగొట్టింది.

నువ్వేం మాయ చేసావో కానీ (ఒక్కడు)

మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ ఒక్కడు సినిమా వచ్చిన కొత్తల్లో అందరి అమ్మాయిల నోటా నానిన పాట “నువ్వేం మాయ చేసావో కానీ”. అంతలా ఆకట్టుకుంది ఈ సాంగ్.

యమునా తీరం (ఆనంద్)

మంచి కాఫీలాంటి సినిమా ఆనంద్ లో “యమునా తీరం” పాట ద్వారా హీరోయిన్ ఇష్టాఇష్టాలను వెల్లడించారు. శేఖర్ కమ్ముల ఎంతో చక్కగా ఈ పాటని చిత్రీకరించారు.

మనసున నువ్వేలే (సుకుమారుడు)

ఆది, నిషా అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన సుకుమారుడు చిత్రంలో మనసున నువ్వేలే అనే పాట హాయిగా సాగిపోతుంది.

సొగసుచూడ తరమా (సైనికుడు)

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అయినప్పటికీ సైనికుడు చిత్రంలో హీరోయిన్ త్రిష కోసం “సొగసుచూడ తరమా” అనే పాట పెట్టారు.

ఏ చిలిపి కళ్ల లోన (ఘర్షణ)

విక్టరీ వెంకటేష్ మూవీ ఘర్షణ లో హీరోయిన్ ఆసిన్ కోసం “ఏ చిలిపి కళ్ల లోన” అనే ఇంట్రడక్షన్ పాట పెట్టారు. చాలా బాగుంటుంది.

ఆకాశాన ఎగిరే మైన (మనసంతా నువ్వే)

ప్రేమ కథ చిత్రం మనసంతా నువ్వేలో “ఆకాశాన ఎగిరే మైన ” అనే పాట ద్వారా హీరోయిన్ గురించి పరిచయం చేశారు.

ఎక్కడెక్కడున్నాడో (వీర)

మాస్ మహారాజ్ రవితేజ మూవీ వీర లో వీరలెవల్లో హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్ ఉంది. ఎక్కడెక్కడున్నాడో అంటూ తాప్సి తన కాబోయే బాయ్ ఫ్రెండ్ గురించి వెతుకుతుంటుంది.

గూగుల్ సెర్చ్ లోన ( రెబెల్)

అందమైన అమ్మాయి తన మనసులో ఏయేమి అనుకుంటుందో .. ఆ ఆలోచనలకు రూపమే “గూగుల్ సెర్చ్ లోన” సాంగ్. ఇందులో తమన్నా అందమైన స్టెప్పులతో అల్లాడించింది.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలాంటి హీరోయిన్ ఇంట్రడక్షన్ పాటలు అనేకం ఉన్నాయి. మేము మిస్ చేసిన.. మీకు నచ్చిన పాటలను.. కామెంట్స్ చేయండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus