హీరోయిన్లుగా రాణించిన హీరోల కూతుర్లు వీళ్ళే..!

  • June 20, 2020 / 03:15 PM IST

సాధారణంగా హీరోల కొడుకులను హీరోలుగా పరిచయం చేస్తారు కానీ… వారి కూతుర్లను మాత్రం హీరోయిన్లుగా పరిచయం చెయ్యడానికి ఇష్టపడరు.అందుకు ఆ హీరోల అభిమానులు కూడా ఒప్పుకోరు అనుకోండి. అయినప్పటికీ మెల్లగా హీరోల కూతుర్లు కూడా హీరోయిన్లవ్వడానికి లేదా సినిమాల్లో నటీమణులు అవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో కొంత మంది హీరోలు… తమ కూతుర్లను హీరోయిన్లు‌గా లేదా నటీమణులుగా పరిచయం చేసారు. మరి ఆ హీరోలెవరు.. వారి బ్యాక్ గ్రౌండ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆ నటీమణులు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) మెగా ఫ్యామిలీ నుండీ నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.

2)యాంగ్రీ యంగ్ స్టార్ రాజశేఖర్ కూతురు శివాత్మిక.. గతేడాది విడుదలైన ‘దొరసాని’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది.

3)మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ కూడా హీరోయిన్ గా ‘గుండెల్లో గోదారి’ ‘దొంగాట’ వంటి చిత్రాల్లో నటించింది. ‘అనగనగా ఓ ధీరుడు’ ‘వైఫ్ ఆఫ్ రామ్’ సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషించింది.

4)సూపర్ స్టార్ కృష్ణ గారి కూతురు మంజుల కూడా ‘షో’ ‘ఆరెంజ్’ ‘కావ్యాస్ డైరీ’ వంటి సినిమాల్లో నటించింది.

5)యాక్షన్ కింగ్ అర్జున్ కూతరు ఐశ్వర్యా కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. విశాల్ సినిమా ‘పట్టతు యానై’ అనే చిత్రంలో నటించింది.

6) ఒకప్పుడు తమిళ సినిమాల్లో హీరోగా నటించిన విజయ్ కుమార్ ముగ్గురు కూతుర్లు వనిత ‘దేవి’ చిత్రంలో, ప్రీతి ‘రుక్మిణి’ చిత్రంలో , శ్రీదేవి ‘ఈశ్వర్’ చిత్రంలో.. నటించారు.

7)మరో తమిళ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి కూడా హీరోయిన్‌గా రాణిస్తుంది.

8)ఒకప్పటి టాలీవుడ్ హీరో రాజేష్ కూతురు ఐశ్వర్య రాజేష్ కూడా హీరోయిన్ గా పరిచయమైంది. ‘కౌసల్య కృష్ణమూర్తి’ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. తమిళంలో కూడా వరుస సినిమాల్లో నటిస్తుంది.

9) యానివర్సల్ హీరో కమల్ హాసన్ కూతురు శృతీ హాసన్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుండగా..రెండో కూతురు అక్షర హాసన్ కూడా ‘వివేకం’ చిత్రంలో నటించింది.

10)ప్రముఖ నటుడు ఉత్తేజ్ కూతురు చేతన కూడా ‘పిచ్చిగా నచ్చావ్’ అనే చిత్రంలో నటించింది.

11) బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య అమృతా సింగ్ కూతురు సారా అలీ ఖాన్

12) బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కుమార్తె శ్రద్ధా కపూర్

13) బాలీవుడ్ రెబల్ స్టార్ శతృఘ్న సిన్హా కూతరు సోనాక్షి సిన్హా

14) బాలీవుడ్ సూపర్ స్టార్ అనిల్ కపూర్ పెద్ద కూతురు సోనమ్ కపూర్

15) బాలీవుడ్ యాక్షన్ హీరో సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus