క్వారంటైన్ లో అల్లరోడి క్వాలిటీ మూవీ చూసి ఎంజాయ్ చేయండి
April 16, 2020 / 05:29 PM IST
|Follow Us
అల్లరి నరేష్ అతి తక్కువ కాలంలో 50సినిమాలు పూర్తి చేసిన హీరోలలో ఒకరు. ఆధునిక సినిమా పరిశ్రమలో ఇది రికార్డు. ఎన్టీఆర్, ఏ ఎన్ ఆర్ కాలంలో ఇది పెద్ద ఫీట్ ఏమి కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళు ఏడాదికి పది సినిమాలు కూడా చేశేవారు. ఇప్పటి హీరోలకు రెండు మూడంటే గగనమే. ఇక స్టార్ హీరోల పరిస్థితి అయితే మరీ దారుణం ఒకటి లేదా రెండు అంతే. కామెడీ చిత్రాలు హీరోగా ఇండస్ట్రీని ఏలిన హీరో అల్లరి నరేష్ ఆ కేటగిరీలో ఆయన కొట్టినోడు లేదు. కామెడీ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయిన నరేష్ అప్పుడప్పుడు సీరియస్ రోల్స్ ట్రై చేశారు.
పునర్జన్మల నేపథ్యంలో వచ్చిన ప్రాణం చిత్రంలో ఆయన మొదటిసారి ఓ సీరియస్ కంటెంట్ తో కూడిన మూవీలో నటించారు. ఆ సినిమా అంతగా ఫలితం ఇవ్వకపోయినా అల్లరి నరేష్ 2004లో ‘నేను’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ లో నటించాడు. ఈ సినిమా విడుదలై సరిగ్గా నేటికీ 16ఏళ్ళు. ఈ సినిమాలో అల్లరి నరేష్ యాక్టింగ్ పీక్స్ అని చెప్పాలి. ప్రేమకు ఆప్యాయతకు దూరంగా పెరిగిన ఓ అనాధ జీవితంలోకి ఓ అమ్మాయి వస్తే, తనకు అన్నీ తానే అనుకుంటున్న తరుణంలో ఆమె దూరమైపోయే పరిస్థితిలో సైకో మైండ్ కలిగిన యువకుడు ప్రేమ కోసం ఏమి చేశాడు అనే కోణంలో ఈ చిత్రం తెరకెక్కింది.
అప్పటి వరకు తన కామెడీ యాంగిల్ మాత్రమే పరిచయం చేసిన అల్లరి నరేష్ సైకో పాత్రలో రెచ్చిపోయి నటించారు. ఆయన నటన చాల సన్నివేశాల్లో చప్పట్లు కొట్టిస్తుంది. అర్చన హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి ఇ. సత్తిబాబు దర్శకత్వం వహించారు. ఇక మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరుతెచ్చుకున్న నరేష్ కొద్దిరోజులుగా విజయాల పరంగా వెనుక బడ్డారు. ఈ మధ్య ఆయన వరుస ఫెయిల్యూర్స్ చవిచూశారు.