18 Pages Collections: ’18 పేజెస్’ ..మొదటి వారం బాగానే కలెక్ట్ చేసింది కానీ..?

  • December 31, 2022 / 06:27 AM IST

‘జీఏ 2 పిక్చర్స్’ , ‘సుకుమార్ రైటింగ్స్’ నిర్మాణంలో రూపొందిన లేటెస్ట్ మూవీ ’18 పేజెస్’. బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ‘కార్తికేయ2’ వంటి పాన్ ఇండియా హిట్ మూవీ తర్వాత నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్లో వస్తున్న మూవీ ఇది. ‘కుమారి 21ఎఫ్’ వంటి సూపర్ హిట్ తర్వాత సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ కొంత గ్యాప్ తీసుకుని డైరెక్ట్ చేసిన మూవీ కూడా.

డిసెంబర్ 23న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ మూవీకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ జస్ట్ యావరేజ్ గా నమోదయ్యాయి. అలా అని వీక్ డేస్ లో డ్రాప్ అయ్యింది లేదు.స్టడీగానే కలెక్ట్ చేస్తుంది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 3.37 cr
సీడెడ్ 0.63 cr
ఉత్తరాంధ్ర 0.71 cr
ఈస్ట్ 0.46 cr
వెస్ట్ 0.25 cr
గుంటూరు 0.31 cr
కృష్ణా 0.25 cr
నెల్లూరు 0.17 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 6.15 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.62 cr
ఓవర్సీస్ 1.22 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 7.99 cr (షేర్)

’18 పేజెస్’ చిత్రానికి రూ.12.59 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.13 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.7.99 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.5.01 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇదే విధంగా రెండో వీకెండ్ వరకు కలెక్ట్ చేస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus