రూ.100 కోట్ల సినిమా అవుతుంది అనుకుంటే రూ.3 కోట్లకే సర్దేసింది..!
June 15, 2022 / 06:09 PM IST
|Follow Us
ఈ ఏడాది భారీ నష్టాలు మిగిల్చిన సినిమాలు టాలీవుడ్ నుండి మాత్రమే ఉన్నాయేమో అని మనవాళ్ళు అనుకున్నారు. కాకపోతే బాలీవుడ్లో కూడా ఓ సినిమా భారీ నుంచి అతి భారీ నష్టాలు మిగిల్చిందని తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కమ్ ఫైర్ బ్రాండ్ అయిన కంగనా నటించిన రీసెంట్ మూవీ ‘దాకడ్’ మే 20న విడుదలైంది. రజనీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దీపక్ ముకుత్, సోహెల్ మక్లై సంయుక్తంగా నిర్మించారు.
మొదటి రోజు ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కానీ ఈవెనింగ్ కు సినిమా అసలు టాక్ బయటకు వచ్చింది. దీంతో రెండో రోజు నుండే థియేటర్లో జనాలు లేరు. వీక్ డేస్ స్టార్ట్ అయ్యాక ఎక్కడా కూడా 20 టికెట్లు కూడా తెగలేదు. చాలా చోట్ల షోలు కూడా క్యాన్సిల్ చేశారు.ఓవరాల్ గా ఈ చిత్రానికి రూ.80 కోట్ల బడ్జెట్ పెట్టారట. ప్రమోషన్స్ కోసం మరో రూ.5 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది.
కలుపుకుని రూ.85 కోట్ల వరకు ఈ చిత్రానికి బడ్జెట్ అయ్యిందట. కానీ 3 రోజులకే ఈ చిత్రం దుకాణం సర్దేయడంతో రూ.3 కోట్లకి మించి వసూళ్లు నమోదు కాలేదని తెలుస్తుంది. డిజిటల్ రైట్స్ మాత్రం రూ.5 కోట్ల రేటు పలికినట్టు భోగట్టా. రిలీజ్ కు ముందు ఈ చిత్రం నాన్ థియేట్రికల్ హక్కులకి బిజినెస్ పెద్దగా జరగలేదు. రిలీజ్ తర్వాత చూసుకోవచ్చు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో దర్శకనిర్మాతలు వదిలేశారు.
కానీ సినిమా డిజాస్టర్ అవ్వడం.. ఈ చిత్రం కలెక్షన్ల గురించి కూడా ఎక్కువగా చర్చలు జరుగుతుండడంతో.. నాన్ థియేట్రికల్ రైట్స్ కు మంచి రేట్లు పలకడం లేదట. మొత్తంగా ఈ చిత్రానికి రూ.78 కోట్ల వరకు నష్టం వాటిల్లింది అనేది ఇన్సైడ్ టాక్. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ జనాలు థియేటర్ కు రావడం బాగా తగ్గించేశారు. పోనీ ఓటీటీల్లో అయినా ఎక్కువ మంది సినిమాలు చూస్తున్నారా? అంటే అదీ లేదు. యూట్యూబ్ లో మాత్రమే అక్కడి జనాలు సినిమాలు చూస్తూ కూర్చుంటున్నారు.