ఆసక్తి రేపుతున్న మనోజ్ బాజ్ పాయ్ తాజా చిత్రం పోస్టర్!

  • May 16, 2016 / 10:26 AM IST

స్వతహా హిందీ నటుడైనప్పటికీ.. తెలుగు, తమిళ భాషల్లోనూ మంచి గుర్తింపు ఉన్న నటుడు మనోజ్ బాజ్ పాయ్. మెగా హీరోలైన పవన్ కళ్యాణ్ తో “పులి”, అల్లు అర్జున్ తో “హ్యాపీ” సినిమాల్లో నటించిన మనోజ్ బాయ్ పాయ్ మన తెలుగువారికి కూడా సుపరిచితుడే.

అయితే.. ఈమధ్యకాలంలో మనోజ్ కు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. “తాను కమర్షియల్ సినిమాలకు పనికిరానేమో?” అని స్వయంజ్ మనోజ్ బాజ్ పాయ్ స్టేట్ మెంట్ ఇచ్చే స్థాయికి ఆయన పరిస్థితి వచ్చింది. కానీ.. ఒక నటుడిగా మాత్రం ఆయన్ను ఎవ్వరూ విస్మరించలేదు. అందుకే ఇప్పటికీ పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ ఆయన్ను వెతుక్కుంటూ వస్తుంటాయి.

ఆయన నటించిన తాజా చిత్రం “కృతి”. రాధికా ఆప్టే, నేహ శర్మ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ట్విట్టర్ ద్వారా అభిషేక్ బచ్చన్ విడుదల చేసారు. ఎంతో ఆసక్తికరంగా ఉన్న సదరు పోస్టర్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకొంటోంది. ఇకపోతే.. మనోజ్ నటించగా గత శుక్రవారం విడుదలైన “ట్రాఫిక్”కు మిశ్రమ స్పందన లభించింది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus