Brahmastra: పాన్ ఇండియా సినిమా పైరసీ… ఫస్ట్ టైమ్ ఫైన్… ఏ సినిమాకంటే?
September 5, 2023 / 10:32 PM IST
|Follow Us
పైరసీ చేయడం నేరం, పైరసీ భూతం, పైరసీని ప్రోత్సహించకండి, సినిమా ఇండస్ట్రీని పైరసీ తినేస్తోంది, సినిమాల ఎదుగుదలకు పైరసీనే పెద్ద అడ్డంకి అంటూ.. గత కొన్నేళ్లుగా భారతీయ సినిమా ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. ఏ సినిమా రిలీజ్ అవుతోంది అన్నా.. ఈ నినాదాలు పెద్ద ఎత్తున వినిపించేవి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. కొత్త చట్టం కారణంగా… ఓ పైరసీకి పెద్ద ఎత్తున జరిమానా పడింది. బాలీవుడ్ పాన్ ఇండియా సినిమాను పైరసీ చేసినందుకు ఏకంగా రూ. 20 లక్షలు జరిమానా విధించారు.
సినిమాటోగ్రఫీ యాక్ట్‌లో ఇటీవల కేంద్ర ప్రభుత్వదం మార్పులు చేసింది. పైరసీని బలంగా అడ్డుకోవడానికి కీలకమైన సవరణలు చేసింది. అందులో భాగంగా వచ్చిన అంశాల ఆధారంగా పైరసీ విషయంలో మొదటి తీర్పు వచ్చేసింది. తాము హక్కులు కొనుగోలు చేసిన ‘బ్రహ్మాస్త్ర 1 – శివ’ సినిమాను పైరసీ చేసి స్ట్రీమింగ్ చేసినందుకుగాను స్టార్ మా నెట్ వర్క్ ఇటలీవల కోర్టులో కేసు వేసింది. దీనికి కొన్ని వెబ్ సైట్స్ కారణం అంటూ ఆధారాలతో సహా న్యాయస్థానానికి సమర్పించింది.
ఆధారాలను పరిశీలించిన జస్టిస్ ప్రతిభ.ఎం.సింగ్ తీర్పునిచ్చారు. సినిమాను పైరసీ చేసిన ఆ సైట్లకు రూ.20 లక్షలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ పైరసీ వ్యవహారంలో తొలుత 18 సైట్ల వివరాలను కోర్టు ముందుంచిన స్టార్ ఛానల్ ఆ తర్వాత మరికొన్నింటిని యాడ్ చేసింది. మొత్తంగా సినిమాను పైరసీ చేసినందుకు భారీ మొత్తంలో జరిమానా కట్టాల్సి వస్తోంది. గత కొన్నేళ్లుగా పైరసీ భూతం వల్ల నిర్మాతలు భారీ ఎత్తున నష్టపోతున్నారు. ఇప్పుడు ఈ తీర్పు వల్ల నిర్మాతలకు ధైర్యం వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
థియేటర్లలో రన్ అవుతున్న సినిమాలకు హెచ్డీ ప్రింట్లు బయటకు వచ్చేస్తుండటంతో ఓటీటీ సంస్థలు కూడా వీలైనంత త్వరగా స్ట్రీమింగ్‌ను స్టార్ట్ చేసేస్తున్నాయి. తాజాగా రజనీకాంత్ ‘జైలర్’ సినిమా ఇలానే బయటకు వచ్చేయగా… అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రీపోన్ చేసేసింది అని సమాచారం. లేకపోతే రెండు వారాల తర్వాత సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారట.