ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!
June 30, 2022 / 07:37 PM IST
|Follow Us
2021 కంటే కూడా 2022 లో బాక్సాఫీస్ కళకళలాడిపోద్ది అని అంతా ఆశించారు.మరీ ముఖ్యంగా 2022 ఆరంభం చాలా గ్రాండ్ గా ఉంటుంది అని అంతా అనుకున్నారు. ఎందుకంటే ఈ ఏడాది సంక్రాంతికి ‘ఆర్.ఆర్.ఆర్’ ‘భీమ్లా నాయక్’ ‘సర్కారు వారి పాట’ ‘రాధే శ్యామ్’ వంటి బడా సినిమాలు పోటీ పడనున్నట్టు అధికారిక ప్రకటనలు వచ్చాయి. కానీ థర్డ్ వేవ్ దెబ్బకి అలాంటిదేమీ జరగలేదు. అదృష్టం కొద్దీ థియేటర్లు క్లోజ్ అవ్వలేదు కానీ.ఒక్క ‘బంగార్రాజు’ తప్ప జనవరిలో మరో పెద్ద సినిమా సంక్రాంతి బరిలో రిలీజ్ అవ్వలేదు. చిన్న చితకా సినిమాలు రిలీజ్ అయినా అవి రాణించలేదు. దీంతో ‘బంగార్రాజు’ మాత్రమే ప్రేక్షకులకి ఆప్షన్ అయ్యింది. 2022 ఓపెనింగ్ ఇంత డల్ గా ఉంటుంది అని ఎవ్వరూ ఊహించలేదు.
చూస్తుండగానే 6 నెలలు గడిచిపోయాయి. అప్పుడే 2022 ఫస్ట్ హాఫ్ అయిపోయింది అంటే నమ్మ బుద్ధి కావడం లేదు. అయితే కొంతలో కొంత సంతోషించదగ్గ విషయం ఏంటి అంటే కరోనా కారణంగా 2 ఏళ్ళకి పైనే రిలీజ్ కు పెండింగ్ లో ఉన్న పెద్ద సినిమాలు ఎట్టకేలకు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ పెద్ద సినిమాల రిజల్ట్ ఏంటి అన్నది కూడా తేలిపోయింది. ఇంకా రిలీజ్ కావాల్సిన సినిమాలు ఉన్నాయి కానీ కొంతలో కొంత పెద్ద సినిమాల రిజల్ట్స్ సస్పెన్స్ మాత్రం వీడింది. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేసి 2022 ఫస్ట్ హాఫ్ లో అంటే జనవరి నుండి జూన్ 30 వరకు విడుదలైన సినిమాల్లో బాక్సాఫీస్ వద్ద రాణించిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) బంగార్రాజు :
నాగార్జున- నాగ చైతన్య కాంబినేషన్లో ‘సోగ్గాడే చిన్ని నాయన’ కి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. ‘సోగ్గాడే.. ‘ లా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అని అనుకున్నా అలాంటిది ఏమీ జరగలేదు. జస్ట్ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసి హిట్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు.
2) డిజె టిల్లు :
సిద్దు జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. 2022 కి మొదటి బ్లాక్ బస్టర్ ను అందించిన మూవీ ఇదే కావడం విశేషం.
3) భీమ్లా నాయక్ :
పవన్ కళ్యాణ్ హీరోగా రానా కీలక పాత్రలో మలయాళం సూపర్ హిట్ మూవీ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీని సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేయగా త్రివిక్రమ్ కథలో మార్పులు, మాటలు , స్క్రీన్ ప్లే ని అందించారు. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను రాబట్టుకుని మొదట మంచి ఓపెనింగ్స్ ను సాధించింది కానీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయి అబౌవ్ యావరేజ్ మూవీ గా నిలిచింది.
4) ఆర్.ఆర్.ఆర్ :
ఎన్టీఆర్- రాంచరణ్- రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ మార్చి 25న విడుదల అయ్యి ఇండియన్ వైడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. టాలీవుడ్ లో అయితే ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ అని చెప్పాలి.
5) సర్కారు వారి పాట :
మహేష్ బాబు హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 12న రిలీజ్ అయ్యి నెగిటివ్ టాక్ ను మూటకట్టుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద బాగా పెర్ఫార్మ్ చేసి అబౌవ్ యావరేజ్ గా నిలిచింది.
6) ఎఫ్3 :
వెంకటేష్ – వరుణ్ తేజ్ లు హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 27న రిలీజ్ అయ్యి హిట్ టాక్ ను సంపాదించుకుంది కానీ బాక్సాఫీస్ వద్ద అబౌవ్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.
7) మేజర్ :
అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 3న రిలీజ్ అయ్యి హిట్ టాక్ ను సంపాదించుకుని బాక్సాఫీస్ వద్ద డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
8) సమ్మతమే :
కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా నటించిన ఈ మూవీ జూన్ 24న రిలీజ్ అయ్యి యావరేజ్ మూవీగా నిలిచింది. ఇంకా బాక్సాఫీస్ వద్ద రన్ అవుతుంది కానీ ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయడం లేదు.
డబ్బింగ్ మూవీస్ ఫలితాలు :
9) కె.జి.ఎఫ్ చాప్టర్ 2 :
యష్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 14న రిలీజ్ అయ్యి ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
10) విక్రమ్ :
కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న రిలీజ్ అయ్యి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. పాన్ ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
11) డాన్ :
శివ కార్తికేయన్ హీరోగా సి.బి.చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 13న రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ మూవీ సక్సెస్ సాధించింది.
12) వలీమై :
అజిత్ హీరోగా హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 24న రిలీజ్ అయ్యి… తమిళ్ లో ఎలా ఉన్నా తెలుగులో మాత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితాన్ని అందుకుంది.
13) ఈటి :
సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 10న రిలీజ్ అయ్యి .. తమిళ్ లో ఆడకపోయినా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితాన్ని అందుకుంది.