OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాల లిస్ట్

  • December 15, 2022 / 01:39 PM IST

డిసెంబర్ నెల ప్రారంభమై 15 రోజులు పూర్తికావస్తోంది. అంటే సగం నెల అయిపోయినట్టే. అయితే గడిచిన రెండు వారాల్లో ‘హిట్2’ తప్ప కాస్త పేరున్న సినిమా రాలేదు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. గత వారం అన్నీ చిన్నా చితకా సినిమాలు రిలీజ్ అయ్యాయి. దీంతో జనాలు ఎవ్వరూ కూడా థియేటర్లకు వెళ్ళలేదు. దీంతో జనాలకు ఓటీటీలే తృప్తినిచ్చాయని చెప్పాలి. ప్రతీ వీకెండ్ కు 10 కి పైనే సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. థియేటర్లలో మిస్ అయిన సినిమాలను వీకెండ్ కు హ్యాపీగా ఇంట్లో కూర్చొని చూసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ వీకెండ్ కు ‘అవతార్ 2’ వంటి సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్న సినిమా రిలీజ్ అవుతుంది. దీంతో పాటు ఇంకా చిన్నా చితకా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ జనాలకు ‘అవతార్ 2’ పై తప్ప వేరే సినిమా పై ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఆ సినిమా చూశాక.. కచ్చితంగా వాళ్ళు వీకెండ్ కు టైం పాస్ చేసేది ఓటీటీ సినిమాలతోనే. అందుకే ఈ వీకెండ్ ఏకంగా 21 సినిమాలు/ సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) ఇంటింటి రామాయణం : సురేష్ నరెడ్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి క్రేజీ దర్శకుడు మారుతి సహా నిర్మాతగా వ్యవహరించడంతో అంచనాలు పెరిగాయి. ఈ మూవీ నేరుగా ‘ఆహా’లో స్ట్రీమింగ్ కాబోతుంది.

2) ఫిజిక్స్ వాలా : ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. 6 ఎపిసోడ్లుగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.

3) గ్లిట్టర్ : నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

4) డోంట్ పిక్ ఆఫ్ ది ఫోన్ : ఈ డాక్యుమెంటరీ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

5) ఐ బిలీవ్ ఇన్ శాంటా : నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

6) హూ కిల్డ్ శాంటా : ఇది కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

7) హ్యారీ అండ్ మేగన్ – 2 : ఇది కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

8) ఇండియన్ ప్రిడేటర్: బీస్ట్ ఆఫ్ బెంగళూరు : ఈ మూవీ డిసెంబరు 16 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

9) ద రిక్రూట్ : ఈ మూవీ డిసెంబర్ 16 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

10) ఏ స్ట్రోమ్ ఆఫ్ క్రిస్మస్ : ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 16 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

11) అరియిప్పు : ఈ మలయాళం మూవీ డిసెంబర్ 16 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

12) కోడ్ నేమ్ తిరంగ : ఈ హిందీ మూవీ డిసెంబరు 16 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

13) ఫార్ ఫ్రమ్ హోమ్ : ఈ నైజీరియన్ సిరీస్ డిసెంబరు 16 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

14) ప్రైవేట్ లెసన్ : ఈ మూవీ డిసెంబరు 16 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

15) బార్డో: ఫాల్స్ క్రానికల్ ఆఫ్ ఏ హ్యాండ్ ఫుల్ ఆఫ్ ట్రూత్స్ : డిసెంబర్ 16 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

16) గోవింద్ నామ్ మేరా : డిసెంబర్ 16 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

17) అనంత: ద ఎటర్నల్ : ఈ బెంగాలీ మూవీ డిసెంబరు 16 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

18)స్ట్రాంగ్ ఫాదర్స్, స్ట్రాంగ్ డాటర్స్ : ఈ మూవీ జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది.

19) దిల్ దియాన్ గల్లాన్ : డిసెంబరు 12 నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

20) కారాగార్ 2 : ఈ బెంగాలీ మూవీ హోయ్ చోయ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

21) ద ఫాక్ట్ సీజన్ 2 : ఈ సిరీస్ డిసెంబరు 16 నుండి లయన్స్ గేట్ ప్లే లో స్ట్రీమింగ్ కానుంది.

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus