ఆ సినిమా ఆగిపోతే చిరు… చూడాలని ఉంది చేసాడట..!

  • August 27, 2020 / 08:37 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా గుణ శేఖర్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘చూడాలని ఉంది’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 1998 వ సంవత్సరం..ఆగష్టు 22న విడుదలైన ఈ చిత్రం.. ఈరోజుతో 22 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది.అయితే చిరు లాంటి మెగాస్టార్…అందులోనూ మాస్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉన్న హీరో ‘చూడాలని ఉంది’ అనే క్లాస్ టైటిల్ తో సినిమా చెయ్యడం ఏంటి అని అప్పట్లో చిరు డై హార్డ్ ఫ్యాన్స్ చాలా టెన్షన్ అయ్యారు. కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మించారు.రాంగోపాల్ వర్మ… చిరుతో ‘వినాలనివుంది’ అనే చిత్రాన్ని మొదలుపెట్టి.. సగం షూటింగ్ పూర్తి చేసి మధ్యలో వదిలి వెళ్ళిపోయాడు. టబు, ఊర్మిళ ఆ చిత్రంలో హీరోయిన్లు..!

అయితే ఆ చిత్రం ఆగిపోవడంతో చిరు…తన మాస్ ఇమేజ్ ను పక్కన పెట్టి ఓ ఇంటెన్షనల్ డ్రామా చెయ్యాలి అనుకున్నాడట. ఆ టైంలో ‘సొగసు చూడ తరమా’ ‘బాల రామాయణం’ వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు గుణ శేఖర్ … ‘చూడాలని ఉంది’ కథను చెప్పారట. చిరు సింగిల్ సిటింగ్ లో ఈ కథను ఓకే చేసారట. దాంతో చిరు సన్నిహితులు ఆశ్చర్యపోవడమే కాదు.. చిరు ని ‘ఇంకోసారి ఆలోచించుకో’ అని చెప్పారట. అయినా చిరు తగ్గలేదు. పైగా ‘చూడాలని ఉంది’ అనే టైటిల్ అనౌన్స్ చేసాక చిరు ఫ్యాన్స్ లో మరింత టెన్షన్ పెరిగిందట. కొంత భాగం కోల్ కతా లో తెరకెక్కించినప్పటికీ… అపార్ట్ మెంట్ ఎపిసోడ్స్ మాత్రం హైదరాబాద్ లోనే సెట్ వేసి తీసారట.

నిర్మాత అశ్వినీ దత్ మంచి నీళ్ళు మాదిరి డబ్బులు ఖర్చు పెట్టేస్తుంటే సెట్ లో ఉన్నవారందరూ అలా బిత్తర చూపులు చూస్తుండిపోయేవారట. సినిమా రిలీజ్ అయ్యే వరకూ అందరికీ టెన్షన్ గానే ఉందట.అయితే విడుదల రోజున మాత్రం అభిమానుల టెన్షన్ మొత్తం పటాపంచలు అయిపోయింది.సినిమా చూసిన వాళ్లు అంతా ఓ కొత్త అనుభూతి కలిగినట్టు ప్రశంసలు కురిపించారు. ముఖ్యం చిరు.. హీరోయిన్ అంజలా జావేరి మధ్య వచ్చే ట్రైన్ సీన్ కు అందరూ ఫిదా అయిపోయారు. ఇప్పటి యూత్ కు కూడా ఆ ట్రైన్ సీన్ … దానికి మణిశర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు కనెక్ట్ అవ్వడం గ్యారంటీ అనే చెప్పాలి.

1

2

3

4

5

6

7

8

9

Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus