Santosh Sobhan: ప్రభాస్‌ నమ్మితే.. ఇంతలా ప్రేమిస్తాడా.. సంతోష్‌ చాలా లక్కీ!

  • April 4, 2023 / 01:56 PM IST

టాలీవుడ్‌లో కుర్ర హీరోల్లో అదృష్టవంతుడు ఎవరు అంటే.. ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సంతోష్‌ శోభన్‌. అదేంటి అన్నీ లక్కీ హిట్లు సాధిస్తున్నాడా? అని అడుగుదాం అనుకుంటున్నారా? ఆగండాగండి.. మేం చెబుతున్నది సినిమా ఛాన్స్‌ల గురించి. అవును మీరు చదివింది కరెక్టే. ఎన్ని ఫ్లాప్‌లు వస్తున్నా, డిజాస్టర్‌లు వస్తున్నా.. అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. అంతేకాదు ఆ అవకాశాలు భారీగా ఉంటున్నాయి. అందుకే లక్కీ అని అంటున్నాం. టాలీవుడ్‌లో దురదృష్టం, అదృష్టం పక్కపక్కనే ఉన్న కుర్ర హీరోల లిస్ట్ రాస్తే..

అందులో సంతోష్‌ శోభన్‌  పేరు తొలి స్థానాల్లో కచ్చితంగా ఉంటుంద. టాలెంట్, లుక్‌తో ఆకట్టుకుంటూ ఒకవైపు, పెద్ద బ్యానర్ల అండతో మరోవైపు దూసుకుపోతున్నాడు. అయితే హిట్‌ కూడా పడితే ఇంకా బాగుండేది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ హిట్‌ కోసం తనను తొలుత నుండి సపోర్టు చేస్తున్న ప్రభాస్‌ అండ్‌ కో. మరోసారి రంగంలోకి దిగింది అని చెబుతున్నారు. సంతోష్‌ శోభన్‌  హీరోగా ఓ భారీ బడ్జెట్‌ సినిమాను రూపొందించాలని యూవీ క్రియేషన్స్‌ అనుకుంటోందట.

దీని కోసం ఏకంగా రూ.25 కోట్లు బడ్జెట్‌ అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. సంతోష్‌ శోభన్‌ ప్రస్తుతం ఉన్న ఫామ్‌లో ఈ బడ్జెట్‌ అంటే భారీ బడ్జెట్‌ అనే చెప్పాలి. ఇప్పటికే పెట్టిన బడ్జెట్‌ వెనక్కి రావడం పక్కనపెడితే.. ప్రచారానికి చేసిన ఖర్చు కూడా వెనక్కి రావడం లేదు. అంత టైట్‌గా ఉంటోంది సంతోష్‌ శోభన్‌ సినిమాల పరిస్థితి. ఇటీవల అతని నుండి వచ్చిన ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రయిబ్‌’, ‘కళ్యాణం కమనీయం’, ‘శ్రీదేవి శోభన్‌బాబు’, సినిమాల పరిస్థితి గురించి అందరికీ తెలిసిందే.

వీటి సంగతి పక్కనపెడితే ఈ కొత్త సినిమాను శ్రీరామ్‌ రెడ్డి అనే యువ దర్శకుడు తెరకెక్కిస్తారు అని టాక్‌. మరి నేపథ్యం ఏంటి, యాక్టర్స్‌, టెక్నీషియన్స్‌ పాడింగ్‌ ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus