Mahesh Babu: మహేష్ త్రివిక్రమ్ మూవీ బడ్జెట్ అన్ని కోట్లా..?

  • May 6, 2021 / 07:51 PM IST

మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా ప్రకటన వెలువడినప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్లకు సంబంధించి, కథ గురించి, సినిమాలో ఇతర పాత్రల్లో నటిస్తున్న నటీనటులకు సంబంధించి ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. వైరల్ అవుతున్న వార్తల్లో ఏ వార్త నిజమో ఏ వార్త అబద్ధమో తెలియాలంటే అధికారికంగా చిత్రయూనిట్ ప్రకటించే వరకు ఆగాల్సిందే. అయితే ఈ సినిమాలో మహేష్ తో పాటు మరో హీరో కూడా నటించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన అల వైకుంఠపురములో సినిమాలో సుశాంత్ సెకండ్ హీరో రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సెకండ్ హీరోగా సుధీర్ బాబు నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. మహేష్, సుధీర్ బాబు కాంబినేషన్ లో సినిమా తెరకెక్కితే మాత్రం ఫ్యాన్స్ కు పండగే అని చెప్పాలి. అతడు, ఖలేజా సినిమాల ద్వారా త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబును ఫ్యామిలీ ఆడియన్స్ కు చేరువ చేశారు. మహేష్ హ్యాట్రిక్ హిట్లతో సూపర్ ఫామ్ లో ఉన్నారు.

మహేష్ సర్కారు వారి పాట షూటింగ్ లో పాల్గొంటూనే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొననున్నారు. కరోనా కేసులు తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడితే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2022 సమ్మర్ కానుకగా ఈ మూవీ కానుంది. దాదాపు 130 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus