ప్రేక్షకుల్ని థియేటర్లకు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా
December 2, 2018 / 03:42 AM IST
|Follow Us
తమిళనాట ‘రోబో 2.0’ సినిమా పైరసీకి గురవ్వడంతో సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ పైరసీదారులకు సినిమాని లీక్ చేసే ధైర్యం ఉంది. రజనీకాంత్ అభిమానుల్లారా మనం నేరస్థులకు గుణపాఠం నేర్పాలి’ అని రసూల్ పూకుట్టి పైరసీదారులపై నిప్పులు కక్కుతున్నారు. ‘వేల మంది టెక్నీషియన్లు నాలుగేండ్ల కష్టం ఈ చిత్రం. మీకు అద్భుతమైన అనుభూతిని ఇవ్వడానికి చేసిన ప్రయత్నమిది. సినిమాను థియేటర్లో చూసి ఎంజారు చేయండి. అనుభూతిని నాశనం చేయకండి.
పైరసీకి నో చెప్పండి’ అని లైకా సంస్థ కూడా ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే, మరోవైపు ఇందులో ఓ స్పెషల్ సాంగ్‌ని పెట్టే యోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం. ఈపాటను సుమారు రూ.15కోట్లతో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. నిడివిని దృష్టిలో పెట్టుకుని తొలుత ఈ పాటను తొలగించారట. అయితే మళ్ళీ ఈ పాటను జత చేయాలని భావిస్తున్నారట.