Narappa Movie: ఈ 3 హైలెట్స్ లేకపోతే ‘నారప్ప’ గట్టెక్కడం కష్టమయ్యేది..!

  • July 20, 2021 / 02:40 PM IST

వెంకటేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూసిన ‘నారప్ప’ మూవీ ఈరోజు విడుదలైంది. ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా ‘నారప్ప’ ని నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో విడుదల చేశారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘అసురన్’ కు ఇది రీమేక్ కావడం.. అలాగే ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైనర్లు తెరకెక్కించే శ్రీకాంత్ అడ్డాల ఇలాంటి వియొలెన్స్ తో కూడుకున్న సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు అనే ప్రకటన రావడంతో సినిమా పై అందరికీ ఆసక్తి పెరిగింది. అయితే ఆ అంచనాలను ఈ సినిమా అందుకుండా అంటే.. పూర్తిగా అవునని చెప్పలేము. నిజానికి ‘అసురన్’ కథ అంత గొప్ప కథ ఏమీ కాదు. మన ‘రంగస్థలం’ ‘పలాస’ వంటి సినిమాలతో పోలిస్తే అది అంతంత మాత్రమే..! కానీ హీరో ధనుష్ అక్కడ వయసుకి మించిన పాత్ర చేయడం.. కులాల ప్రస్తావన, కక్ష సాధింపులు వాటి అంశాలు ఎక్కువ మేళవించడంతో అక్కడి నేటివిటీకి అది పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది.

కానీ తెలుగుకి వచ్చే సరికి కులాల ప్రస్తావన ఉండదు… పేద- ధనిక సమస్యగా మార్చారు. అక్కడ ధనుష్ కి అది వయసుకి మించిన పాత్ర అయితే ఇక్కడ వెంకీకి వయసుకి తగ్గ పాత్ర. దాంతో వెంకీ ఈ పాత్రకి కరెక్ట్ గా సెట్ అవ్వడమే కాకుండా అద్భుతమైన హావభావాలు పలికించాడు. దీనికి వెంకటేష్ ను ఎంత పొగిడినా తక్కువే..! ప్రియమణి తమిళంలో ఇలాంటి క్యారెక్టర్స్ చేసింది కానీ తెలుగులో ఆమె ఇలాంటి పాత్రని ఎప్పుడూ చేయలేదు. కాబట్టి.. ప్రియమణి నటన కూడా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు. అక్కడ జివి ప్రకాష్ కుమార్ సంగీతం సినిమాకి ఎంత ప్లస్ అయ్యిందో.. తెలుగులో మణిశర్మ సంగీతం కూడా అదే స్థాయిలో ప్లస్ అయ్యింది. దాదాపు అవే ట్యూన్లను వాడుకున్నప్పటికీ తన ప్రత్యేకతని చూపించాడు మణిశర్మ.

పాన్ ఇండియా సినిమాలకి మణిశర్మ పర్ఫెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అని చాలా మంది చెబుతుంటారు. ఆ రేంజ్లో ఇతన్ని ఎప్పుడు వాడుకుంటారో మరి. ‘నారప్ప’ కి మెయిన్ హైలెట్స్ ఇవే అని చెప్పాలి. కార్తీక్ రత్నం,రాఖీ వంటి పాత్రలు కథలో కీలకం అయ్యాయి కానీ వాళ్లకి ఎక్కువ స్కోప్ లేదు. ఇక దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విషయానికి వస్తే.. వెంకటేష్ ను హైలెట్ చేయాల్సిన చోట హైలెట్ చేయలేకపోయాడు. ఇసుకలో ఫైట్, క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ లను తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా తీసే అవకాశం ఉన్నా అతను ఆ అవకాశాన్ని వాడుకోలేకపోయాడు. ఫ్లాష్ బ్యాక్ లో వెంకీ.. నాజార్ అండ్ ఫ్యామిలీని నరికే ఫైట్ బాగుంది. కానీ అంతకు ముందు సెకండ్ హీరోయిన్ ను అవమానించిన విలన్ ను కొట్టే ఫైట్ కి హై .. ఇవ్వలేకపోయాడు దర్శకుడు. సో మొత్తానికి ‘నారప్ప’ లో వెంకీ, ప్రియమణి ల పెర్ఫార్మెన్స్ మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లు మాత్రమే ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి.

Click Here To Read Movie Review

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus