అంచనాలను అందుకోలేకపోయిన 31 ఏళ్ల ‘ధర్మక్షేత్రం’ గురించి ఆసక్తికర విషయాలు..
February 14, 2023 / 03:14 PM IST
|Follow Us
దర్శక నిర్మాతలు.. నటీనటులు ఒక్కోసారి ప్రేక్షకాభిమానులకు వినోదంతో పాటు సమాజానికి మంచి సందేశాన్నివ్వాలనే ఉద్దేశంతో.. అప్పటి పరిస్థితులకనుగుణంగా ఉండే సామాజిక అంశాన్ని తీసుకుని.. దానికి కాస్త సినిమాటిక్ సొగసులద్ది.. అందంగా, అర్థవంతంగా చెప్పే ప్రయత్నం చేద్దామనుకుంటారు కానీ.. అవి అంతగా ఆకట్టుకోకపోవడం అనేది జరుగుతుంటుంది.. పైగా స్టార్ హీరోలతో ఇలాంటి ప్రయోగాలు చేస్తే కష్టమనే చెెప్పాలి.. అలా యువరత్న నందమూరి బాలకృష్ణ – స్టార్ డైరెక్టర్ ఎ. కోదండ రామి రెడ్డిల క్రేజీ కాంబినేషన్లో వచ్చి..
అంచనాలను అందుకోలేక పోయిన చిత్రం ‘ధర్మక్షేత్రం’.. 1992 ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవ కానుకగా విడుదలైన ఈ మూవీ 2022 ఫిబ్రవరి 14 నాటికి 31 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు చూద్దాం..కరెప్టెడ్ పొలిటిషియన్స్ కొందరు తమ స్వార్థ రాజకీయాల కోసం.. ఓటు బ్యాంక్ కోసం కాలేజ్ స్టూడెంట్స్‌ని కులం పేరుతో రెచ్చ గొట్టి.. వాళ్లని తమ అసాంఘిక కార్యకలాపాలకు వాడుకుంటూ.. ఉజ్వల భవిష్యత్ ఉన్న విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని తెలుసుకుని..
ఒక నిజాయితీగల న్యాయవాది ఆ పరిస్థితులను మార్చడానికి ధర్మంగా చేసిన పోరాటమే ‘ధర్మక్షేత్రం’.. బెనర్జీ అనే లాయర్ పాత్రలో బాలయ్య నటన ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా దివ్య భారతితో కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది.. ‘మ్యాస్ట్రో’ ఇళయ రాజా కంపోజ్ చేసిన సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి.. ‘ఎన్నో రాత్రులొస్తాయి గానీ.. రాదీ వెన్నెలమ్మా’ పాట అయితే ఎవర్ గ్రీన్..30 సంవత్సరాల తర్వాత బాలయ్య అన్న కొడుకు నందమూరి కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ సినిమాలో ఈ క్లాసిక్ సాంగ్ రీమిక్స్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే ‘ధర్మక్షేత్రం’ లోని పాటను తమిళ నాట సూపర్ స్టార్ రజినీ కాంత్, గౌతమి హీరో హీరోయిన్లుగా నటించిన ‘ధర్మదురై’ నుండి తీసుకున్నారు. దానికి ఇళయ రాజానే సంగీత దర్శకుడు.. ‘‘మాసి మాసమ్ మాలాన పొన్ను’’ అనే గీతం ఆధారంగా తెలుగులో కంపోజ్ చేశారు. సినిమా అంచనాలను అందుకోలేకపోయినా.. టీం మంచి ప్రయత్నం చేశారంటూ అభినందనలు అందుకుంది..