Ram Charan: నాలుగు సినిమాలను రిజెక్ట్ చేసిన చరణ్.. చివరకు..?
March 31, 2021 / 08:57 PM IST
|Follow Us
సినిమా రంగంలో కథల ఎంపిక విషయంలో జాగ్రత్త పడితే మాత్రమే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కథల ఎంపిక విషయంలో ఏ మాత్రం ఆలసత్వం, నిర్లక్ష్యం వహించినా వరుస ఫెయిల్యూర్ల వల్ల ఇబ్బందులు పడక తప్పదు. ప్రతి హీరో తన కెరీర్ లో కొన్ని కథలను రిజెక్ట్ చేసి ఉంటారు. రిజెక్ట్ చేసిన కథలు ఫ్లాప్ అయితే నష్టం లేదు కానీ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే మాత్రం హీరోలు ఫీల్ అవుతూ ఉంటారు.
హీరో రామ్ చరణ్ తన సినీ కెరీర్ లో నాలుగు సినిమాలను రిజెక్ట్ చేయగా ఆ నాలుగు సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందలేక డిజాస్టర్లుగా నిలవడం గమనార్హం. మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో తెరకెక్కిన కృష్ణార్జున్ యుద్ధం సినిమాలో నటించే ఛాన్స్ మొదట రామ్ చరణ్ కే రాగా కథ నచ్చకపోవడంతో రామ్ చరణ్ ఆ కథను రిజెక్ట్ చేశారు. చరణ్ అంచనా వేసినట్లుగానే ఆ సినిమా డిజాస్టర్ కావడం గమనార్హం.
కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన నేల టికెట్ సినిమాలో నటించే ఛాన్స్ మొదట రామ్ చరణ్ కే రాగా ఆ సినిమాలో రోల్ నచ్చినా వేర్వేరు కారణాల వల్ల ఆ సినిమాలో నటించడానికి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన ఓకే బంగారం సినిమాలో కూడా మొదట చరణ్ కే ఛాన్స్ రాగా చరణ్ ఒప్పుకోకపోవడంతో దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో నటించారు.
గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఎటో వెళ్లిపోయింది మనస్సు సినిమాలో కూడా మొదట రామ్ చరణ్ కే ఛాన్స్ రాగా కొన్ని కారణాల వల్ల చరణ్ ఆ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపలేదు. రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథల్లో మూడు సినిమాలు ఫ్లాప్ కాగా ఓకే బంగారం హిట్ అయినా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. చరణ్ రిజెక్ట్ చేసిన సినిమాల గురించి తెలిసిన నెటిజన్లు చరణ్ జడ్జిమెంట్ మామూలుగా లేదని కామెంట్లు చేస్తుండటం గమనార్హం.