బిగ్ బాస్ సీజన్ – 5 లో అప్పుడే 50 రోజులు గడిచిపోయాయి. సగం సీజన్ అయిపోయింది. మొదటివారం నుంచీ కూడా హౌస్ మేట్స్ ఈసీజన్ లో అస్సలు ఒకరికొకరు సంబంధం లేకుండానే గేమ్ ని ప్రారంభించారు. అంతేకాదు, ప్రత్యేకమైన బాండింగ్ ని కూడా ఆడియన్స్ కి చూపించలేకపోయారనే చెప్పాలి.
ఒక్కసారి హైలెట్స్ చూసినట్లయితే..,
** మొదటివారమే నామినేషన్స్ హీటెక్కించాయి. ఈసీజన్ లో స్టార్టింగ్ ఇవే హైలెట్ అయ్యాయి. చెత్త కవర్స్ ని డెస్ట్ బీన్ లో వేస్తు అందరూ హౌస్ ని హీటెక్కించారు. ఈ నామినేషన్స్ లో షణ్ముక్ కి సన్నీకి ఫస్ట్ ఆర్గ్యూమెంట్ జరిగింది. నా గేమ్ నేను ఆడుకుంటాను ఎవరన్నా చెప్తే నాకు కాలుద్ది అంటూ షణ్ముక్ సన్నీని నామినేట్ చేశాడు. తర్వాత హమీదా పిల్లితో మాట్లాడే మాటలు హైలెట్ అయ్యాయి. తర్వాత హమీద పవర్ రూమ్ యాక్సెస్ పొంది ప్రియని ఈ సీజన్ మొత్తానికి కెప్టెన్ కాకుండా సెలక్ట్ చేస్కుంది. ఇంటి సభ్యులు అందరూ కలిసి జెస్సీని వరెస్ట్ పెర్ఫామర్ గా జైల్ కి పంపారు. ఫస్ట్ వీక్ కెప్టెన్ గా సిరి ఎంపిక అయ్యింది. మొదటివారం హౌస్ మేట్స్ అందరూ ఎంతో ఉత్సాహంగా పవర్ రూమ్ టాస్క్ లో పాల్గొన్నారు. అందరికీ గేమ్ ఆడే అవకాశం లభించలేదు కానీ, హైలెట్ మాత్రం కొంతమందే అయ్యారు.
*** ఇక సెకండ్ వీక్ ఉమాదేవిపై ఉన్న కోపాన్ని హమీదాపై ప్రదర్శించింది శ్వేతవర్మ. హమీదాపై పెయింట్ కొట్టిన శ్వేత తర్వాత రిగ్రేట్ అయ్యింది అందరికీ సారీ చెప్పింది. అంతేకాదు, ఆ వీకెండ్ వీకెండ్ నాగార్జున సాక్షిగా ఆడియన్స్ కి క్షమాపణ చెప్తూ , హమీదా పేరెంట్స్ కి క్షమాపణ చెప్తూ తన ముఖంపై తాను గట్టిగా కొట్టుకుని పశ్చాత్తాప పడింది. ఈ వీక్ లో ఉమాదేవి ఆలుకర్రీ, నటరాజ్ మాస్టర్ గుంటనక్క ఇవన్నీ కూడా హైలెట్ అయ్యాయి. ఈవారం నుంచీ ఉమా ఇంకా లోబో ఇద్దరి లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యింది. ఒకవైపు శ్రీరామ్ చంద్ర ఇంకా హమీదాలు దగ్గరవుతుంటే మరోపక్క వీరిద్దరూ ఫన్నీ గా స్కిట్స్ చేస్తూ రెచ్చిపోయారు.
ఈవారం ఉల్ఫ్ టీమ్, ఈగల్ టీమ్ ల మద్యన గట్టి యుద్ధమే జరిగింది. మానస్ కి శ్రీరామ్ కి గొడవ అయ్యింది. శ్రీరామ్ చంద్ర యాటిట్యూడ్ హౌస్ లో కొంతమంది హౌస్ మేట్స్ కి నచ్చలేదు. షణ్ముక్ అండ్ సిరి ఇద్దరికీ జెస్సీ బాగా దగ్గరయ్యాడు. ఈ టాస్క్ లోనే సన్నీతో మగాడివైతే ఆడు రా అంటూ ప్రియ చేసిన కామెంట్స్ , ఉమాదేవిని అనీమాస్టర్ తిట్టిన తిట్లు, స్ట్రెచ్ చేస్తూ శ్వేత పడిపోవడం ఇవన్నీ కూడా హైలెట్ అయ్యాయి. ఇక ఈవారం సన్నీ వరెస్ట్ పెర్ఫామర్ గా జైల్ కి వెళ్లాడు. వీకండ్ హౌస్ ని ఆర్డర్ లో పెడుతూ నాగార్జున హోస్టింగ్ సాగింది.
**** మూడోవారం హైలెట్ అంటే అది లహరి – రవి హగ్ ఇష్యూనే, ఈ ఇష్యూని హైలెట్ చేసింది ప్రియ. నామినేషన్స్ లో వీరిపై ఎలిగేషన్ వేసింది. దీంతో లహరి రవి ఇద్దరూ ప్రియపై ఫుల్ ఫైర్ అయ్యారు. హగ్ ని రాంగ్ అంటావా అంటూ క్లాస్ పీకారు. ఆ తర్వాత హైదరాబాద్ అమ్మాయి, అమెరికా అబ్బాయి టాస్క్ లో శ్రీరామ్ ఇంకా షణ్ముక్ ఇద్దరూ హైలెట్ అయ్యారు. ఇక్కడే సీక్రెట్ టాస్క్ ని దిగ్విజయంగా ఫినిష్ చేసి కెప్టెన్సీ పోటీదారుడు అయ్యాడు రవి. హౌస్ లో అందరూ తమ ఫస్ట్ లవ్ గురించి మాట్లాడారు. సిరి, ప్రియాంక, మానస్, రవి , లోబో , ప్రియ ఇలా అందరూ తమ ఫస్ట్ లవ్ గురించి గుర్తుచేసుకుని చెప్పారు. ఈవారం మానస్ తనంతటే తానే వరెస్ట్ పెర్ఫామర్ అని చెప్పి జైల్ కి వెళ్లాడు. వీకెండ్ నాగార్జున రవి ప్రియా మాట్లాడిన వీడియో చూపించి లహరికి క్లారిటీ ఇచ్చాడు.
****నాలుగోవారం చూసినట్లయితే నామినేషన్స్ లో లోబో రెచ్చిపోయి మరీ ప్రియపై అరిచాడు. “ఐ డోంట్ కేర్ జనాలు” అనే డైలాగ్ హైలెట్ అయ్యింది. ఇక రవి గుంటనక్క అంటుంటే తీస్కోలేకపోతున్నానని నటరాజ్ మాస్టర్ కి స్ట్రయిట్ గా చెప్పాడు. అలాగే నామినేషన్స్ అప్పుడు సారీ కూడా చెప్పి ఒక మెట్టుపైకి ఎక్కాడు. గుంటనక్క ఒక్కటే కాకుండా , ఊసరవెల్లి ఎవరో కూడా చెప్పాడు నటరాజ్ మాస్టర్. ఈవారం ‘గెలవాలంటే తగ్గాల్సిందే’ టాస్క్ లో మానస్ , శ్రీరామ్ చంద్ర ఇద్దరూ అందరూ ఆశ్చర్యపోయేలా వెయిట్ తగ్గారు. సన్నీ అండ్ మానస్ లు టాప్ లో ఉన్నారు. ఇక హమీదా కెప్టెన్సీని త్యాగం చేసి శ్రీరామ్ ని పోటీలో నిలబెట్టింది.
ఇక్కడే సన్నీకి ఎక్కువగా కత్తిపోట్లు దింపారు హౌస్ మేట్స్ అందరూ. హౌస్ లో సన్నీకి ఎంత వ్యతిరేకత ఉందో అతనికి తెలిసొచ్చింది. మానస్ శ్వేతకి కత్తి దింపి శ్రీరామ్ కి సపోర్ట్ చేసి ట్విస్ట్ ఇచ్చాడు. శ్రీరామ్ కెప్టెన్ అయ్యాడు. అంతేకాదు, ఇదేవారం మరోసారి జెస్సీని జైలుకి పంపారు హౌస్ మేట్స్.
****ఐదోవారం నెక్ట్స్ వీక్ శ్రీరామ్ కెప్టెన్ అయ్యాడు హమీదా రేషన్ మేనేజర్ అయ్యింది. ఇదే హమీదాకి మైనస్ అయ్యింది. రేషన్ మేనేజర్ గా హమీదా అవ్వడం ఇంట్లో వాళ్లకి ఆంక్షలు పెట్టడం నచ్చలేదు. ఐదోవారం నామినేషన్స్ ల పెద్ద దుమారమే అయ్యింది. సీక్రెట్ నామినేషన్స్ లో భాగంగా షణ్ముక్ ని ఏకంగా 8మంది హౌస్ మేట్స్ నామినేట్ చేశారు. ఇక ఇక్కడ్నుంచీ నా గేమ్ చూపిస్తా అంటూ షణ్ముక్ రెచ్చిపోయి మరీ సవాల్ చేశాడు.
శ్రీరామ్ చంద్ర కెప్టెన్ అయ్యాక జెస్సీ ఇంకా షణ్ముక్ సిరిలతో వాగ్వివాదం అయ్యింది. షణ్ముక్ జెస్సీ తరపున వకాల్తా పుచ్చుకుని మరీ వచ్చి శ్రీరామ్ ని నిలదీశాడు. ఇక్కడ్నుంచే కార్నర్ బ్యాచ్ గా, మోజ్ బ్యాచ్ గా, త్రీ ఇడియట్స్ గా అయ్యారు ఈ ముగ్గురు. ఇదేవారం కాజల్ వచ్చి కిచెన్ వర్క్ గురించి మాట్లాడుతుంటే లోబో ఫింగర్ చూపించాడు. దీనిపై కాజల్ డీప్ గా హర్ట్ అయ్యింది. రాజుల టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో రవి టీమ్ గెలిచింది.
****ఆరోవారం కూడా ఒకర్ని ఒకరు నిందించుకుంటూ నామినేషన్స్ చేస్కున్నారు. ఆరు వారాలు అయినా కూడా హౌస్ మేట్స్ మద్యన బాండింగ్ అస్సలు పెరగలేదు. ఈవారం బొమ్మల టాస్క్ లో కూడా బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. సీక్రెట్ గా స్లిప్ ని స్పెషల్ డాల్ లో పంపించాడు. అయినా కూడా హౌస్ లో ప్రోపర్టీస్ ని డ్యామేజ్ చేసినందుకు శ్వేత ఇంకా లోబో ఇద్దరూ టాస్క్ నుంచీ ఎలిమినేట్ అయ్యారు. ఇక్కడే షణ్ముక్ అండ్ టీమ్ కి మరోసారి ఝలక్ పడింది. ప్రియ అండ్ టీమ్ కి ప్రత్యేకమైన బొమ్మ వల్ల బెనిఫిట్ అయ్యింది. సంచాలకులుగా కాజల్ అండ్ సిరి ఇద్దరూ కూడా ఫెయిల్ అయ్యారు.
*****ఇక నెక్ట్స్ వీక్ ఏడోవారం నామినేషన్స్ లో సన్నీ ప్రియల ఇష్యూ హైలెట్ అయ్యింది. రవిని సోఫా పై టవల్ ఆరేశాడని నామినేట్ చేసింది ప్రియ, దీన్ని తెలివిగా యాక్సెప్ట్ చేసిన సన్నీ హీరో అయ్యాడు. అంతేకాదు, హంటర్ గా అన్నిసార్లు సన్నీ విన్ అయ్యి గేమ్ లో తనెంత ఫోకస్ గా ఉన్నానో మరోసారి ప్రూవ్ చేశాడు. ఇక్కడే ఫేక్ ఎలిమినేషన్ లో భాగంగా లోబోని సీక్రెట్ రూమ్ లోకి పంపించారు. ఈవారం ఇచ్చిన ఎగ్స్ టాస్క్ లో జెస్సీకి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ని సరిగ్గా అర్ధం చేస్కోలేకపోయాడు. దీంతో షణ్ముక్, సిరి, జెస్సీ ముగ్గురూ కూడా మరోసారి ఫెయిల్ అయ్యారు.
50రోజుల బిగ్ బాస్ హౌస్ మేట్స్ జెర్నీలో మొత్తం 7గురు ఇప్పటికే ఎలిమినేట్ అయిపోయారు. ఇందులో ఫస్ట్ సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేత ఇంకా ప్రియలు ఉన్నారు. ఆరుగురు ఫిమేల్ కంటెస్టెంట్, ఒక మేల్ కంటెస్టెంట్ మాత్రమే ఎలిమినేట్ అయ్యారు.