“బిచ్చగాడు” కోటీశ్వరుడు అయ్యాడు

  • June 25, 2016 / 06:18 AM IST

సినిమాల్లో క్రేజీ కాంబినేషన్లు, ఫారెన్ లొకేషన్లు అవసరం లేదని, మంచి కథ ఉంటే చాలని తెలుగు సినీ ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. డబ్బింగ్ సినిమా అయినా నచ్చితే హిట్ చేస్తామని చెప్పకనే చెప్పారు. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ విజ‌య్ ఆంటోనీ హీరోగా నటించిన తమిళ చిత్రం “పిచ్చైకార‌న్”. దీనిని తెలుగులో బిచ్చగాడుగా అనువదించారు.

శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై ఈ సినిమాను  మే 13 న తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్  చేశారు.  ప్ర‌ముఖ నిర్మాత చదలవాడ తిరుపతిరావు బిచ్చగాడి తెలుగు హ‌క్కుల‌ను రూ.30 ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేశారు. ఆయ‌న ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌కు మ‌రో రూ.20 ల‌క్ష‌లు ఖర్చు పెట్టారు. మెల్లగా మౌత్ టాక్ తో ప్రచారం మొదలై థియేటర్లు నిండడం మొదలయ్యాయి. సినిమా బాగుందనే టాక్ రావడం తో  రెండో వారం నుంచి కలెక్షన్లు పెరిగాయి.

6వ వారంలోకి చేరుకునే సరికి బిచ్చ‌గాడు రూ. 16 కోట్లు వసూలు చేసాడు. జులై 1వ తేదీకి 50 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ ఐదు దినాల్లో వీకెండ్ రోజులు ఉండడం, పెద్ద చిత్రాలు ఏవీ విడుదల కానందున ఈ సినిమా 50 రోజులు నాటికి రూ.20 కోట్లు కలక్షన్ రాబడుతుందని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus