7 Days 6 Nights Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘7 డేస్ 6 నైట్స్’
July 5, 2022 / 03:41 PM IST
|Follow Us
ఎం.ఎస్.రాజు… ఒకప్పుడు బ్లాక్ బస్టర్ చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్ గా ఉండేది ఈ పేరు. ‘శత్రువు’ ‘దేవి’ ‘మనసంతా నువ్వే’ ‘ఒక్కడు’ ‘వర్షం’ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి చిత్రాలు ఇప్పటికీ ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టవు. అలా అని ఆ సినిమాలకి ఎం.ఎస్.రాజు దర్శకుడు కాదు నిర్మాతగా అలాగే స్క్రీన్ ప్లే ని అందించారాయన. అంత గొప్ప సినిమాలను అందించిన ఎం.ఎస్.రాజు గారు దర్శకుడిగా కూడా ‘వాన’ ‘డర్టీ హరి’ వంటి చిత్రాలను తెరకెక్కించారు.
ఇటీవల ‘7 డేస్ 6 నైట్స్’ అంటూ మరో యూత్ ఫుల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ చిత్రం మొదటి షోతోనే ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. వీకెండ్ కే ఈ మూవీ బాక్సాఫీస్ రన్ ముగిసింది. ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :
నైజాం
0.11 cr
సీడెడ్
0.06 cr
ఆంధ్రా(టోటల్)
0.07 cr
ఏపి+తెలంగాణ (టోటల్)
0.24 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్
0.07 cr
వరల్డ్ వైడ్ టోటల్
0.31 cr
‘7 డేస్ 6 నైట్స్’ చిత్రానికి రూ.1.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు 1.3 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉండగా.. ఫుల్ రన్ ముగిసేసరికి కేవలం రూ.0.31 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దీంతో బయ్యర్లు బిజినెస్ మీద 0.90 కోట్ల వరకూ నష్టపోయారని చెప్పొచ్చు. ‘7 డేస్ 6 నైట్స్’ ను మంచి రేటుకి ఓటీటీకి ఇచ్చేశారు.
నిజానికి ఇది ఓటీటీలోనే రిలీజ్ కావాల్సిన మూవీ. కానీ థియేటర్లలో వదిలారు. రూ.2 కోట్ల బడ్జెట్ లోనే ఈ సినిమాని పూర్తిచేశారు. సొంత బ్యానరే కాబట్టి.. పెద్దగా ఖర్చు అయ్యింది ఏమీ. డిజిటల్ రైట్స్ రూ.4.5 కోట్లకు అమ్ముడుపోయినట్టు ట్రేడ్ పండితుల సమాచారం. నిర్మాతకి ఈ మూవీ ప్రాఫిటబుల్, కానీ బయ్యర్స్ కే నష్టాలు వచ్చాయి.