Prabhas: ప్రభాస్‌ కోసం అశ్వనీదత్‌ భారీగా ఖర్చు పెట్టారుగా!

  • July 9, 2022 / 07:57 PM IST

వైజయంతి మూవీస్‌ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్‌ K’ (వర్కింగ్‌ టైటిల్‌). ఈ సినిమాకు సంబంధించి నిర్మాత అశ్వనీదత్‌ డబ్బుల్ని పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. అయితే ఇదే కొత్త విషయం కాదు. సినిమాకు సుమారు రూ. 400 కోట్లు పెడుతున్నారని చాలా రోజుల నుండి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ సినిమా కోసం ఏకంగా రూ.8 కోట్లు పెట్టి కెమెరాను తీసుకొచ్చారనేది తాజా అంశం. అంతే కాదు ఇప్పుడిదే వైరల్‌ పాయింట్‌ కూడా.

మంచి కథకు అంతకుమించిన గ్రాఫిక్స్‌తో సినిమాలు తీయడం ఇప్పుడు తెలుగు సినిమాల్లో ట్రెండ్‌. మంచి కథను రాసుకోవడం, సినిమా తీయడంలో నాగ్‌ అశ్విన్‌ దిట్ట. దానికి గ్రాఫిక్స్‌ను జోడించి ఇప్పుడు ‘ప్రాజెక్ట్‌ K’ తీస్తున్నారు. దీని కోసం ఈ మధ్య ఆనంద్‌ మహీంద్రా సాయం కూడా తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం ఓ కాస్ట్‌లీ కెమెరాను వాడుతున్నారట. దాని ధర రూ. 8 కోట్లు దాటి ఉంటుందని సమాచారం.

‘ప్రాజెక్ట్‌ K’ ఓ ఫాంట‌సీ చిత్రమనే విషయం తెలిసిందే. ప్రేక్ష‌కుల్ని ఊహా ప్ర‌పంచంలోకి తీసుకెళ్లే క‌థ‌ అని చెబుతున్నారు. అందుకే ఈ సినిమా కోసం కొత్త ర‌కం టెక్నాల‌జీని వాడుతున్నారట. ఈ క్రమంలో ‘ఆరి అలెక్సా 65’ అనే కెమెరాను వాడుతున్నారట. ఈ కెమెరాను హాలీవుడ్‌ భారీ చిత్రాల్లో వాడుతుంటారట. ‘అవెంజర్స్‌’, ‘గాడ్జిల్లా’, ‘కింగ్ కాంగ్’ లాంటి సినిమాల‌కు వాడిన ఈ ఖ‌రీదైన కెమెరాను ఇప్పుడు ‘ప్రాజెక్ట్‌ K’ కోసం వాడుతున్నారట.

ఈ కెమెరా ప్రత్యేకత… హై ఎండ్ మోష‌న్ పిక్చ‌ర్స్‌కి క్యాప్చ‌ర్ చేయడం. అయితే ఈ కెమెరాను అన్ని సీన్ల‌కూ వాడటర. కొన్ని ప్రత్యేకమైన షాట్ల కోసం మాత్రమే ఈ కెమెరా వాడ‌తారట. ‘ఆరి అలెక్సా 65’ కెమెరాను కొనుగోలు చేసి, వాడుతున్న తొలి భారతీయ సినిమా ‘ప్రాజెక్ట్‌ K’ అవుతోందన్నమాట. అంతేకాదు ఈ కెమెరాను యాక్సెస్‌ చేయడానికి కొంత‌మంది విదేశీ టెక్నీషియ‌న్లను కూడా తీసుకొచ్చారట.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus