యంగ్ టైగర్ ఎన్టీఆర్.. యాక్టింగ్, డాన్సింగ్, డైలాగ్ డెలివరీ.. అన్నింట్లోనూ తనకు తానే సాటి అనిపించుకున్నాడు.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో డబుల్ హ్యాట్రిక్ కొట్టడమే కాక.. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీడియాలు కూడా తన పర్ఫార్మెన్స్ గురించి పొగుడుతూ ఆర్టిక్టల్స్ రాశాయి. సాధారణంగా తారక్ గురించి ఏ వార్త వచ్చినా వైరల్ చేసే ఫ్యాన్స్ ఇప్పుడు తన అభిమాన హీరో లగ్జరీ లైఫ్ ఎలా ఉంటుందనే న్యూస్‌ని నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.
సెలబ్రిటీల లైఫ్ స్టైల్, లగ్జీరియస్ గాడ్జెట్స్, వాడే మొబైల్స్, పెట్స్, కార్స్.. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. జూనియర్ ఎన్టీఆర్ షూ కాస్ట్, ధరించిన టీషర్ట్, మాస్క్ రేట్ల గురించిన న్యూస్ చూశాం.. ఇప్పుడు తారక్ లైఫ్ స్టైల్‌కి సంబంధించిన విషయాలు కొన్ని చూద్దాం..
లావిష్ బంగ్లా..
గతంలో హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో ఉండే తారక్.. కొద్దికాలం క్రితం జూబ్లీహిల్స్ షిఫ్ట్ అయ్యాడు.. తన టేస్టుకి తగ్గట్టు అత్యాధునిక సౌకర్యాలతో అందమైన ఇంటిని నిర్మించుకున్నారు. ఈ హౌస్ ల్యాండ్ యొక్క ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఎంతో తెలుసా?.. అక్షరాలా 60 నుండి 80 కోట్లు..
లగ్జీరియస్ లంబోర్ఘిని..
జూనియర్ ఎన్టీఆర్‌కి డ్రైవింగ్, రేసింగ్ అంటే చాలా ఇష్టం.. అప్పుడప్పుడు అర్థరాత్రి హైదరాబాద్ రోడ్ల మీద సరదాాగా చక్కర్లు కొడుతుంటాడు కూడా.. తన గ్యారేజీలో ఖరీదైన బైకులు, కార్లు ఉన్నాయి.. ఇండియాలో లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సుల్‌ని 3.5 కోట్లతో సొంతం చేసుకున్నాడు..
వాచ్ అమ్మితే బ్యాచ్ సెటిలైపోద్ది..
ఇక తారక్ చేతికి పెట్టుకునే రిచర్డ్ మిల్లే ఎఫ్ 1 ఎడిషన్ వాచ్ ఖరీదు 3 నుండి 4 కోట్లు.. ధర తెలిస్తే దిమ్మతిరిగి బొమ్మ కనిపించడమే కాదు.. వాచ్ అమ్మితే బ్యాచ్ సెటిలైపోద్ది అనే సినిమా డైలాగ్ కూడా గుర్తొస్తుంది కదూ..
ఆ మాత్రం రేంజ్ ఉండాలి మరి..
ఎన్టీఆర్ గ్యారేజీలో ఉన్న ఖరీదైన కార్లలో ల్యాండ్ రోవర్ రేంజ్ రేవర్ వోగ్ కూడా ఒకటి.. ఆకట్టుకునే ఫీచర్స్ ఉన్న ఈ కార్ ధర 2.3 కోట్లు..
కార్ చిన్నది.. రేటు మాత్రం…
జూనియర్ కొన్న పొర్షియో 718 కయెన్ కార్ కాస్ట్ 1.25 కోట్లు..
బీఎమ్‌డబ్యూ కూడా..
యంగ్ టైగర్ వాడే బీఎమ్‌డబ్యూ 720 ఎల్డీ కార్ ప్రైజ్ 1.32 CR..
మెర్సిడెస్ బెంజ్ ఎంతంటే..
మెర్సిడెస్ మెంజ్ జీఎల్సీ 350D ధర 90 లక్షల రూపాయలు..
బాబోయ్ అది బైకేనా..
ఇక టూవీలర్ విషయానికొస్తే.. తారక్ దగ్గర 14 లక్షల విలువ చేసే సుజికి హయబుసా స్పోర్ట్ బైక్ కూడా ఉంది..
9999 నంబర్ ప్లేటుకే భారీ ధర..
తారక్ వాడే అన్ని లగ్జరీ వెహికల్స్‌కి 9999 నంబరే ఉంటుంది.. తాత ఎన్టీఆర్, నాన్న హరికృష్ణ కూడా 9 నంబర్ వాడారని.. అలా తనకు ఆ నంబర్ అలవాటైందని చెప్తుండే తారక్.. ఒక్కోకారుకి ఒక్కోసారి లక్షల్లో (ఇటీవల 10.50 లక్షలు) వెచ్చించారు..
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!