Kalyan Ram: ఎట్టకేలకు ‘డెవిల్’విషయంలో ఓ పాజిటివ్ వైబ్… సూపర్ అప్డేట్!
December 11, 2023 / 01:50 PM IST
|Follow Us
కల్యాణ్ రామ్ ‘డెవిల్’… ఈ సినిమా గురించి చాలా రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. అయితే అది నెగిటివ్ వైబ్స్ ఇచ్చేదే. సినిమా దర్శకుడు మారాడు, పదే పదే డైరక్షన్ డిపార్ట్మెంట్ డిటైల్స్ మారుతున్నాయి. వాయిదాలు పడుతోంది సినిమా అంటూ అలాంటి వార్తలే వచ్చాయి. అయితే ఇటీవల సినిమా రిలీజ్ డేట్ చెప్పడంతో ఒక్కొక్కటిగా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. తాజాగా కల్యాణ్‌రామ్ కాస్ట్యూమ్స్ గురించి చర్చ వచ్చింది.
డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో కల్యాణ్ రామ్ పేరు. మాస్ ఎలిమెంట్స్ ఉంటూనే కొత్త తరహా కథలు ఎంచుకుంటారు ఆయన. అలా ఇప్పుడు ‘డెవిల్’ అనే సినిమా చేస్తున్నారు. అభిషేక్ నామా దర్శకనిర్మాతగా ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధమైంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమాను డిసెంబర్ 29న విడుదల చేస్తారు. ఈ నేపథ్యంలో సినిమాలో కల్యాణ్‌రామ్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన రాజేష్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పారు.
పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘డెవిల్’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారతదేశాన్ని బ్రిటిషర్లు పాలించిన కాలానికి సంబంధించిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. 1940ల కాలాన్ని సినిమాలో చూపించబోతున్నారు. కల్యాణ్ రామ్ ఇందులో గూఢచారిగా కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో కాస్ట్యూమ్స్ అప్పటి పరిస్థితులను, పాత్ర స్వభావాన్ని పోట్రే చేయాలి. దీంతో అలాంటి డ్రెస్సులే సిద్ధం చేశారట.
‘డెవిల్’ సినిమాలో కల్యాణ్ రామ్ (Kalyan Ram) ధోతి కట్టుకుని ఉంటారు. దాని పైన ఒక వెయిస్ట్ కోటు ఉంటుంది. అలా ఆయన కాస్ట్యూమ్స్‌లో భారతీయత కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాం అని చెప్పారు రాజేశ్. మొత్తంగా ఈ సినిమాలో కల్యాణ్ రామ్ 90 కాస్ట్యూమ్స్ ఉపయోగించారట. ఇటలీ నుండి తెప్పించిన మోహైర్ ఊల్‌తో 60 బ్లేజర్లను ప్రత్యేకంగా ఈ సినిమా కోసం తయారు చేశారట.
వెయిస్ట్ కోటుతో పాటు దేశీయ కాటన్‌తో కుర్తా, ధోతిని ప్రత్యేకంగా తయారు చేశారట. బ్లేజర్, కుర్తా, ధోతి… ఇలా ప్రతి కాస్ట్యూమ్ కోసం 11.5 మీటర్ల ఫ్యాబ్రిక్ వాడారట. హీరోను స్టైల్‌గా చూపించేందుకు 25 ప్రత్యేకమైన వెయిస్ట్ కోట్స్ సిద్ధం చేశారట. కల్యాణ్ రామ్ వేసుకున్న బ్లేజర్ జేబు పక్కన వేలాడుతూ ఉండేలా ఓ హ్యాంగింగ్ వాచ్‌ను స్పెషల్‌గా డిజైన్ చేశారట.