‘ఆర్.ఎక్స్.100’ ఫేమ్ కార్తికేయ హీరోగా ‘కార్తికేయ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మరికొండ నిర్మించిన చిత్రం ’90.ఎం.ఎల్’. యువ దర్శకుడు శేఖర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం డిసెంబర్ 6న విడుదలయ్యింది. మద్యం తాగకపోతే చనిపోయే డిజార్డర్ తో బాధపడుతున్న హీరోకి తన ప్రేమ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారుతుంది. చివరికి దానిని హీరో ఎలా ఓవర్ రైడ్ చేసాడు అన్నది మిగిలిన కథ. మొదటి షో తోనే ఈ చిత్రం డివైడ్ టాక్ ను మూటకట్టుకుంది. కానీ టీజర్, ట్రైలర్ లతో మొదటినుండీ క్రేజ్ ఏర్పరుచుకోవడంతో కొంత మేర బాగానే కలెక్ట్ చేసిందని చెప్పాలి.
ఇక ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం | 1.10 cr |
సీడెడ్ | 0.39 cr |
ఉత్తరాంధ్ర | 0.44 cr |
ఈస్ట్ | 0.24 cr |
వెస్ట్ | 0.16 cr |
కృష్ణా | 0.24 cr |
గుంటూరు | 0.23 cr |
నెల్లూరు | 0.16 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.07 cr |
ఓవర్సీస్ | 0.06 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 3.09 cr (share) |
’90.ఎం.ఎల్’ చిత్రానికి 3.5 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అయితే ఫుల్ రన్ ముగిసేసరికి కేవలం 3.09 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దాదాపు 0.42 కోట్ల డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే 88 శాతం వరకూ రికవరీ సాధించింది కాబట్టి ఈ చిత్రాన్ని యావరేజ్ గా పరిగణలోకి తీసుకోవచ్చు. ఒకవేళ టాక్ గనుక పాజిటివ్ గా వచ్చి ఉండుంటే.. ఈ చిత్రం కచ్చితంగా కార్తికేయ కెరీర్లో మరో హిట్ గా నిలిచి ఉండేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.