Rohan: 90’s వెబ్ సిరీస్ తో రోహన్ జాతకం మారిపోయిందా.. పది రెట్లు పెంచాడంటూ?

  • March 11, 2024 / 02:30 PM IST

సినిమా రంగంలో సక్సెస్ సాధించాలంటే టాలెంట్ అత్యంత ముఖ్యమనే సంగతి తెలిసిందే. టాలెంట్ ఉంటే ఆలస్యంగా అయినా సక్సెస్ దక్కుతుందని చాలామంది సెలబ్రిటీల విషయంలో ప్రూవ్ అయింది. (90’s – A Middle-Class Biopic) #90s మిడిల్ క్లాస్ బయోపిక్ ఈ మధ్య కాలంలో ఏ స్థాయిలో హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈటీవీ విన్ వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే వెబ్ సిరీస్ కు రోజుకు 2000 రూపాయల నుంచి 3000 రూపాయలు పారితోషికంగా అందుకున్న (Rohan Roy) రోహన్ కు ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లలో వరుస ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.

రోహన్ తన పారితోషికాన్ని అమాంతం పెంచేశాడని తెలుస్తోంది. ఒక సినిమాకు రోహన్ పారితోషికం 30000 రూపాయల రేంజ్ లో ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతుండటం గమనార్హం. రోహన్ టాలెంట్ కు ఆ మాత్రం ఇవ్వొచ్చని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. రోహన్ కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకోవడం ద్వారా రోహన్ కెరీర్ పరంగా మరింత ఎదిగి మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

రోహన్  (Rohan) బెంగళూరులో కుటుంబంతో నివాసం ఉండటంతో ఫ్లైట్ టికెట్ల కోసం భారీ స్థాయిలో ఖర్చు అయిందని సమాచారం అందుతోంది. రోహన్ మిమిక్రీ కూడా బాగా చేస్తాడని తెలుస్తోంది. స్టార్స్ సినిమాలలో ఛాన్స్ వస్తే రోహన్ కెరీర్ మరింత పుంజుకునే అవకాశాలు ఉంటాయి. రోహన్ పూర్తి పేరు రోహన్ రాయ్ కాగా రోహన్ కు సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటం గమనార్హం. #90’s మిడిల్ క్లాస్ బయోపిక్ కు సీక్వెల్ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. సీక్వెల్ కూడా కచ్చితంగా హిట్ అవుతుందని ఈ సిరీస్ అభిమానులు భావిస్తున్నారు.

‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

స్టార్‌ హీరో అజిత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus