Bigg Boss 5 Telugu: హౌస్ మొత్తం నామినేట్ ఎందుకు అయ్యింది..?

  • November 1, 2021 / 02:37 PM IST

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏ జరుగుతుంది ? ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చెప్పలేని పరిస్థితి. 8వవారం దీపావళి ధమాకా ఎపిసోడ్ చాలా బాగా సాగింది. ఆ తర్వాత లోబో ఎలిమినేట్ అయి హౌస్ నుంచీ బయటకి వచ్చేశాడు. దీంతో హౌస్ లో 9వ వారం నామినేషన్స్ రచ్చ అనేది స్టార్ట్ అయ్యింది. ఒకరి ముఖంపై ఒకరు ఫోమ్ ని పూసి మరీ ఓపెన్ నామినేషన్స్ చేస్కున్నారు. ఇందులో భాగంగా హౌస్ మొత్తం నామినేట్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది.

ఈవారం కెప్టెన్ షణ్ముక్ కాబట్టి షణ్ముక్ ఒక్కడే నామినేట్ అవ్వలేదు. మిగతా ఇంటిసభ్యులు అందరూ నామినేట్ అయ్యారు. దీనికి బలమైన కారణం ఏంటి ? ఓపెన్ నామినేషన్స్ లో భాగంగా ఇలా ఒకరినొకరు నామినేట్ చేస్కున్నారా లేదా వేరే రీజన్ ఏదైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది. అయితే, ఇక్కడే అనీమాస్టర్ కి ఉన్న పవర్ ద్వారా ఈవారం నామినేషన్స్ నుంచి సురక్షితం అయ్యిందని కూడా చెప్తున్నారు. అనీమాస్టర్ కి లాస్ట్ వీక్ నాగార్జున సండే గేమ్స్ ఆఢించి అందులో గెలిచినందుకు సూపర్ పవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా ఈవారం నామినేషన్స్ లోకి రాకుండా అనీమాస్టర్ సేవ్ అయినట్లుగా సమాచారం. అనీమాస్టర్, ఇంకా షణ్ముక్ తప్ప అందరూ నామినేట్ అయ్యారు. రవి, సిరి, శ్రీరామ్ చంద్ర, విశ్వ, మానస్, సన్నీ, పింకీ, జెస్సీ , కాజల్ ఇలా అందరూ నామినేట్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది. అదీ మేటర్.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus