కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తెలుగు దర్శకుడి ఇంగ్లీష్ మూవీ.. ‘ఎ బ్యూటిఫుల్ బ్రేకప్’
May 25, 2022 / 08:30 PM IST
|Follow Us
తన సంగీతంతో యావత్ సినీ లోకాన్ని మైమరిపించి బోలెడన్ని హిట్స్ అందించిన జాతీయ అవార్డు గ్రహీత ‘మాస్ట్రో’ ఇళయరాజా సంగీతం అందించిన ‘ఎ బ్యూటిఫుల్ బ్రేకప్’ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ కెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శనకు సిద్ధమైంది.12వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్‌లో రెండు గౌరవాలు అందుకున్న వైజాగ్‌కు చెందిన ఒక వ్యక్తి ఒక ఆంగ్ల చిత్రాన్ని రూపొందించడం తెలుగువారికి గర్వకారణం అనే చెప్పాలి. అయితే ఆ ఇంగ్లీష్ చిత్రం మే 25వ తేదీ సాయంత్రం 4 గంటలకు కేన్స్ 2022 ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడుతోంది. 2022 అమెరికన్ రొమాంటిక్-థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ‘ఎ బ్యూటిఫుల్ బ్రేకప్’ సినిమా ఇదివరకే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు అజిత్ వాసన్ ఉగ్గిన దర్శకత్వం వహించారు. క్రిష్ ముద్రగడ, మటిల్డా ప్రధాన పాత్రల్లో నటించారు.
అయితే దర్శకుడు అజిత్ వాసన్ ఉగ్గిన సినిమా ఇండస్ట్రీలో 20 ఏళ్ళ అనుభవంతో ఈ సినిమాను ఎంతో ఎమోషనల్ గా తెరపైకి తీసుకు వచ్చారు. దర్శకుడిగా అతని చివరి కన్నడ చిత్రం ‘వాసు నాన్ పక్కా కమర్షియల్’ పెద్ద కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఇక ‘మాస్ట్రో’ ఇళయరాజా ‘ఎ బ్యూటిఫుల్ బ్రేకప్’ సినిమా కోసం మ్యూజిక్ కంపోజ్ చేసిన విధానం ఇదివరకే మంచి గుర్తింపును అందుకుంది. బో టై సింఫనీ ఆర్కెస్ట్రాలో మాయా ఒరిజినల్ సౌండ్‌ట్రాక్‌లను ఆయన ఎంతో అద్భుతంగా రూపొందించారు.
యునైటెడ్ కింగ్డమ్ లో ఎమిలీ మాకిస్ అనే కళాకారిణి పాడిన ప్రత్యేక థీమ్ సాంగ్‌ను కూడా కంపోజ్ చేశాడు. ఒక ఇంటర్వ్యూలో ఇలియారాజా మాట్లాడుతూ ఎ బ్యూటిఫుల్ బ్రేకప్ ఒక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్నాడు. దర్శకుడిపై, సినిమాపై ఆయన ప్రశంసలు కురిపించారు. అత్యున్నత స్థాయిలో సాంకేతిక బృందం ఈ సినిమాకు పని చేయడం విశేషం. అనుభవజ్ఞుడైన గుణశేఖర్ కె.ఆర్. సినిమాటోగ్రఫీ అంధించగా KGF ఫేమ్ శ్రీకాంత్ గౌడ ఎడిటింగ్ చేయడం విశేషం.
కర్ణాటక రాష్ట్ర అవార్డు విజేత, సౌండ్ ఎఫెక్ట్‌లకు వి జి రాజన్ (కెజిఎఫ్ ఫేమ్) కూడా ఈ సినిమాకు వర్క్ చేశారు. బ్యూటిఫుల్ బ్రేకప్ లో ఒక ట్రయాలజీ స్టోరీ క్లిఫ్ హ్యాంగర్ క్లైమాక్స్ మరచిపోలేని అనుబూతిని ఇస్తుంది. సినిమా కథాంశం విషయానికి వస్తే.. ద్వేషం పెరిగినప్పుడు కొన్నిసార్లు షరతులు లేని ప్రేమ ఉంటుంది.. క్రిష్ మరియు రూబీ తమ గమ్యం ఏమిటో పట్టించుకోకుండా.. బ్రేకప్ చెప్పే ఆఖరి రోజు వారీ విడిపోవడాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ప్రయాణం సినిమాలో ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుంది.
12వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్‌లో బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను గెలుచుకోవడమే కాకుండా, శ్రీకాంత్ కందాల కోసం ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ (VFX) విభాగంలో ఎ బ్యూటిఫుల్ బ్రేకప్ అవార్డును అందుకుంది. అలాగే ఉత్తమ చిత్రంగా కూడా ఎంపికైంది. ఇది ఆమ్ స్టర్ డామ్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం, టొరంటో స్వతంత్ర చలనచిత్రోత్సవంలో ఇతర అవార్డులను కూడా గెలుచుకుంది. ఇక ఫైనల్ గా కేన్స్ 2022 ఫిల్మ్ ఫెస్టివల్స్ లో పాల్గొనడం, ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన చలనచిత్ర ఈవెంట్లో ఈ చిత్రం ప్రదర్శించబడడం టీమ్‌కు ప్రత్యేక గౌరవం.