Adipurush Movie: ఆదిపురుష్ పై ఆ వార్తలు నిజమేనా?

  • August 17, 2021 / 07:44 AM IST

స్టార్ హీరో ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కృతి సనన్ ఈ సినిమాలో సీత పాత్రలో నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగష్టు 11వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండటం గమనార్హం. సైఫ్ అలీఖాన్ తన పాత్రను ఎలివేట్ చేస్తూ రామాయణాన్ని రావణుడి కోణం నుండి చూద్దామని కామెంట్లు చేశారు.

సైఫ్ అలీ ఖాన్ చేసిన కామెంట్లపై నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా ఈ సినిమా దర్శకుడు ఓం రౌత్ ఆరెస్సెస్ కీలక నేత మోహన్ భగవత్ తో కొంత సమయం స్పెండ్ చేయడం జరిగిందంటూ చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. హార్డ్ కోర్ కాషాయ సంస్థతో దర్శకుడికి పనేంటని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆదిపురుష్ కథలో మార్పుల వల్లే అప్ డేట్ల విషయంలో మేకర్స్ వెనక్కు తగ్గుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆదిపురుష్ మేకర్స్ రామాయణం కథ సోల్ ని దెబ్బ తీస్తున్నారా..? లేక సినిమాలో ఏమైనా అభ్యంతరకర అంశాలు ఉన్నాయా..? అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఆదిపురుష్ మూవీ పాన్ ఇండియా మూవీ కావడంతో అభ్యంతర అంశాలు ఉంటే సినిమా రిజల్ట్ పై కూడా ఆ ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి. మేకర్స్ ఈ సినిమా విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఆదిపురుష్ పై ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే సినిమా రిలీజయ్యే వరకు ఆగాల్సిందే.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus