లూమియర్ బ్రదర్స్ ఆలోచనలకు రూపం కదిలే బొమ్మలు. ఈ చలన చిత్రాలు విదేశాల నుంచి ముంబైకి చేరుకొని మాటలు నేర్చుకున్నాయి. రంగులు అద్దుకున్నాయి. సాంకేతికంగా అనేక మార్పులు చేసుకుంది. సినిమా రంగంలో అభివృద్ధిని స్వీకరించడానికి తెలుగు పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. హాలీవుడ్, బాలీవుడ్ లో వచ్చిన కొత్త టెక్నిక్ లను వెంటనే మనవాళ్లు వెండితెర పై మనకు పరిచయం చేసారు. అలా తెలుగు చిత్ర పరిశ్రమ ప్రయాణంలో కీలక మలుపులు గురించి తెలుసుకుందాం.
1. భక్త ప్రహ్లాదఇంగ్లిష్ భాషలో చలన చిత్రాలు అప్పటికే సంచలనం సృష్టిస్తున్నాయి. మనదేశంలో టాకీ (హిందీ భాష) సినిమా 1931లో విడుదలైంది. ఆ సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేసిన హెచ్.ఎం. రెడ్డి తెలుగులో మాటలు నేర్చిన తొలి తెలుగు చిత్రాన్ని భక్త ప్రహ్లాద(1932) గా తీసుకొచ్చారు.
2. కీలు గుర్రంమొదట్లో దర్శకులు మన పురాణాలను తెరపైకి ఎక్కించారు. ఆ తర్వాత జానపద కథలను సినిమాలుగా మలిచారు. అలా వచ్చిన కీలు గుర్రం సినిమా తెలుగు వారితో పాటు పక్క రాష్ట్రాల ప్రజలకు కూడా నచ్చింది. దాంతో దీన్ని తమిళం లోకి డబ్బింగ్ చేసారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఈ సినిమా ఇతర భాషల్లోకి అనువాదం అయినా ఫస్ట్ తెలుగు మూవీ గా రికార్డ్ లోకి ఎక్కింది.
3. ఇద్దరు మిత్రులుతెలుగు భాషలో సినిమాలు తీయడం మొదలు పెట్టి ముప్పై ఏళ్లు గడిచి పోయాయి. అప్పటివరకు ఎదురుగా ఉన్న మనుషులను, ప్రదేశాలను కెమెరాలో బంధించే వారు. ఆ తర్వాత వేర్వేరు గా తీసిన వాటిని ఒకే ఫ్రేమ్లోకి తెచ్చారు. అది అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరు మిత్రులు(1961) సినిమాతో మొదలయింది. ఇందులో ఏ ఎన్ ఆర్ ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకున్నారు.
4. తేనె మనసులుసాహసాలకు సై అనే నటుడు సూపర్ స్టార్ కృష్ణ. అతను వెండి తెరపై కనిపించిన తొలి సినిమా తేనె మనసులు(1965). అతని అడుగే సంచలనం.. ఎందుకంటే ఇదే తెలుగు మొదటి రంగుల చిత్రం. అప్పటి వరకు సినిమాల్లో కొన్ని సీన్లు కలర్ లో కనిపించేవి. తేనె మనసులు చిత్రం పూర్తిగా కలర్ తోనే ఉంటుంది.
5. సింహాసనంసూపర్ స్టార్ కృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మించి నటించిన సినిమా సింహాసనం. ఈ చిత్రం రికార్డులను తిరగ రాసింది. అంతే కాదు ఫస్ట్ 70 mm తెలుగు మూవీగా చరిత్రలో నిలిచింది.
6. ఆదిత్య 369తెలుగు సినీ అభిమానులు ఒక రకమైన కథలకు అలవాటు పడ్డారు. ఆ మొనాటినీ ని బ్రేక్ చేసిన చిత్రం ఆదిత్య 369. సైన్స్ ఫిక్షన్ కథను సింగీతం శ్రీనివాస రావు అద్భుతంగా తెరకెక్కించి విజయం అందుకున్నారు. నట సింహా నందమూరి బాలకృష్ణ శ్రీ కృష్ణ దేవరాయలుగా, కృష్ణ కుమార్ గా రెండు పాత్రలను చక్కగా పోషించారు. ఇది తొలి తెలుగు సైన్స్ ఫిక్షన్ సినిమాగా లిఖించబడింది.
7. అమ్మోరు1990 లో సినిమాలకు కొంత గ్రాఫిక్, ఎఫెక్ట్స్ ఇవ్వడం మొదలైంది. ఎక్కువగా కంప్యూటర్ గ్రాఫిక్ వర్క్ చేసిన సినిమా అమ్మోరు. 1995 లో విడుదలైన ఈ చిత్రానికి మహిళలు జేజేలు పలికారు. సినిమా చూస్తున్న కొందరికి అమ్మోరు కూడా పూనింది. అంతగా గ్రాఫిక్ వర్క్ జరిగింది.
8. శివకొన్ని పరిమితమైన షాట్లకు కట్టుబడిన తెలుగు పరిశ్రమకు కొత్త టేకింగ్ ను పరిచయం చేసిన సినిమా శివ. రామ్ గోపాల్ వర్మ తన తొలి చిత్రం తోనే ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు. భిన్నమైన టేకింగ్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారారు. అక్కినేని నాగార్జునను హీరోగా నిలబెట్టిన ఈ చిత్రానికి తొలి సారి స్టడీకాం కెమెరాను వినియోగించారు.
9. దొంగల ముఠాసినిమా నిర్మాణం అంటే ఎంతో ఖర్చుతో కూడుకుంది. రూపాయి ఖర్చు చేయకుండా దొంగల ముఠా సినిమాను తీసి రామ్ గోపాల్ వర్మ రికార్డ్ సృష్టించాడు. రవి తేజ, చార్మీ, సునీల్, ప్రకాష్ రాజ్, లక్ష్మి మంచు, బ్రహ్మనందం, సుబ్బరాజు, బ్రహ్మాజీ.. తదితర నటులు పైసా తీసుకోకుండా నటించారు. కేనన్ 5 డీ కెమెరా తో ఐదు రోజుల్లో సినిమాను కంప్లీట్ చేసి ఔరా అనిపించారు.
10. రుద్రమదేవివీరనారి రుద్రమదేవి జీవితను ఆధారంగా చేసుకుని తీసిన సినిమా రుద్రమదేవి. గుణశేఖర్ స్వీయ దర్శ కత్వంలో నిర్మించారు. భారీ బడ్జెక్ట్ తో తీసిన ఈ చిత్రం స్టీరియో స్కోపిక్ త్రీడీ టెక్నాలజీ తో విడుదలై తెలుగువారి ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.