Nivetha Pethuraj: బన్నీ హీరోయిన్‌లో మరో టాలెంట్!

  • July 14, 2021 / 04:49 PM IST

హిడెన్‌ టాలెంట్‌… ఇది అందరిలోనూ ఉంటుంది. దీనికి సెలబ్రిటీలు ఏం అతీతం కాదు కదా. అలా సినిమా తారలు తమ హిడెన్‌ టాలెంట్‌ చూపించి అప్పుడప్పుడు అబ్బురపరుస్తుంటారు. హీరోలు అయితే మార్షల్‌ ఆర్ట్స్‌, రేసింగ్‌ లాంటివి చేసి చూపిస్తుంటారు. హీరోయిన్లలో కూడా కొంతమంది రేసింగ్‌లు లాంటి విషయాల్లో ఆసక్తి చూపిస్తుంటారు. అయితే అందులో ఏకంగా సర్టిఫికేషన్‌ పొందడం అంటే మామూలు విషయమా. నివేదా పేతురాజ్‌ వైవిధ్యమైన సినిమాలు ఎంచుకుంటూ.. తనలోని నటిని ఆవిష్కరిస్తూ ఉంటుంది.

తాజాగా తనలో మరో టాలెంట్‌ను బయటకు చూపించింది. అదే ఫార్ములా రేసింగ్‌. ఇందులో నివేదా గత కొన్ని రోజులుగా శిక్షణ తీసుకుంటోందట. అందులో భాగంగా శిక్షణలో లెవల్‌ 1 సర్టిఫికేట్‌ పొందింది. ఆ విషయాన్ని ఆమెనే సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. రేసింగ్‌ కారులో నివేదా చూస్తే… భలే ఉంది కదా అనిపించకమానదు. మెమొంటమ్‌ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్ రేసింగ్ సంస్థ నుంచి ఈ సర్టిఫికేట్‌ను పొందినట్లు నివేదా షేర్‌ చేసింది.

అయితే మరి రేసింగ్‌ ఆధారిత, నేపథ్య సినిమాల్లో హీరోయిన్‌ కావాలని ఎవరైనా దర్శకుడు అనుకుంటే… నివేదా పేరు ఇన్‌స్టంట్‌గా పరిశీలించొచ్చు అన్నమాట. మరోవైపు నివేదా విశ్వక్‌ సేన్‌కు జోడీగా ‘పాగల్‌’లో నటించింది. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.


Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus